మహాశివరాత్రి జాతరకు పటిష్ట భద్రత
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:14 AM
మహాశివరాత్రి జాతరకు పటిష్ట భద్రత ఏర్పాట్లుతోపాటు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాటులపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేష్ బీ గీతే అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : మహాశివరాత్రి జాతరకు పటిష్ట భద్రత ఏర్పాట్లుతోపాటు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాటులపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేష్ బీ గీతే అదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై పో లీస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వేములవాడలోని భీమే శ్వరస్వామి అలయంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా స్వామివారి దర్శనా నికి వచ్చే భక్తులకు దర్శనం సులభంగా, ప్రశాంతంగా జరిగేలా చూడడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 14వతేదీ నుంచి 16వ తేదీవరకు జరిగే మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయడానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని కోరారు. భీమేశ్వరస్వామి, బద్దిపోచమ్మ, నాంపెల్లి, అగ్రహారం ఆలయాల వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారీ, సీఐలు కృష్ణ, వీర ప్రసాద్, మొగిలి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మదుకర్, రవి, నాగేశ్వర్ రావు, అర్‌ఐలు మదుకర్, యాదగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.