Share News

బక్రీద్‌ పండుగకు పటిష్ట భద్రత..

ABN , Publish Date - May 15 , 2026 | 11:52 PM

బక్రీద్‌ పండుగకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు.

బక్రీద్‌ పండుగకు పటిష్ట భద్రత..

సిరిసిల్ల అర్బన్‌, మే 15 (ఆంధ్రజ్యోతి) : బక్రీద్‌ పండుగకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాల యంలో శుక్రవారం బక్రీద్‌ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బక్రీద్‌ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లాలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పశువుల కొనుగోలు, రవాణా, వధ ప్రక్రియల్లో నిబంధనలు, మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సంతల్లో కొనుగోలు చేసిన పశువులకు సంబంధిత పశువై ద్యాధికారులు జారీ చేసిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలు, రవాణా అనుమతి పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సరైన పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి జంతువుల అక్రమ రవాణాను అడ్డుకునేం దుకు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనిఖీల సమయంలో పోలీస్‌, వెట ర్నరీ అధికారులకు సహకరించాలని కోరారు. ఆవులు, దూడలను అక్రమం గా రవాణా చేసిన, వధించిన, ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా మాంసం విక్రయాలు నిర్వహించడం లాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశువుల అక్రమ రవా ణా, నిషేధిత జంతువుల వధ, అనుమతులు లేకుండా స్లాటర్‌ హౌస్‌ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, మతపెద్దలు శాంతి, సామరస్యాల పరిరక్షణకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాలను ఉపేక్షించబోమని హెచ్చ రించారు. సోషల్‌ మీడియా వేదికలైన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తదితర మాధ్య మాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే మార్ఫింగ్‌ ఫొటోలు, అసత్య ప్రచారాలు, ప్రేరేపిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చ రించారు. ఈ సమావేశంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంక టేశ్వర్లు , ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 11:52 PM