Share News

ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:30 AM

మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు సందర్బంగా 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు
జగిత్యాల కౌంటింగ్‌ కేంద్రం వద్ద భద్రతను పరిశీలిస్తు ఎస్పీ అశోక్‌కుమార్‌

ఎస్పీ అశోక్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు సందర్బంగా 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎస్పీ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత నిర్వహిస్తున్నా మన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద బిఎన్‌ఎస్‌ ఎస్‌ 163(144) సెక్షన్‌ అమలు చేస్తున్నా మన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం, సభలు, సమా వేశాలు, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలను ఉల్లఘంచే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్‌ స్క్వాడ్‌ , బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు. ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు, నిషేధిత వస్తువులయిన అగ్గిపెట్టలు, లైటర్‌, ఇంక్‌ బాటిల్స్‌ పేలుడు కారణం అయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకు రాకూడదని ఎస్పీ తెలిపారు. తనిఖీలు చేసే సమయంలో సహక రించాలని ఆయన సూచించారు. ఎన్ని కల కమిషన్‌ జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుం టామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో డీఎస్పీలు రఘుచందర్‌, రాములు, ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 12:30 AM