సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:31 AM
ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా సిరిసిల్ల పర్యటనకు వస్తుం డడంతో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
సిరిసిల్ల, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి హోదాలో ఎనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా సిరిసిల్ల పర్యటనకు వస్తుం డడంతో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం సాయంత్రం 4 గంట లకు కరీంనగర్ నుంచి హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదా నానికి సీఎం చేరుకుంటారు. సిరిసిల్ల అంబే ద్కర్ చౌరస్తా నుంచి పాదయాత్రగా రగుడు కలెక్టరేట్ చౌరస్తాకు స్థలం వద్దకు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ చేరుకుంటా రు. తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ శ్రేణులు భారీ జన సమీకరణకు పూనుకున్నారు. స్వశక్తి సంఘాల మహిళల ను తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. పాదయాత్రలో 40 వేల మంది, బహిరంగ సభకు 60 వేల మందితో పాటు ఇతర జిల్లాలతో కలిపి లక్షకు పైగా జన సందోహం మధ్య బహిరంగ సభ నిర్వహించే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్ల్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీని వాస్, విజయరమణారావు, ప్రభుత్వ సలహా దారుడు హనుమంతరావులు పరిశీలించారు. ముఖ్యమంత్రి సభా ప్రాంగణం వద్ద రూ 345.78 కోట్లతో చేపట్టి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడె న్షియల్ స్కూల్ నిర్మాణం, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, రూ 99.40 కోట్లతో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటితోపాటు సిరిసిల్ల, వేములవాడ, తంగళ్ళ పల్లి, వీర్నపల్లి వేములవాడ రూరల్, రుద్రంగి లో ఆరు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌రిజిస్టర్ కార్యాలయం, సిరిసిల్ల, వేములవాడలో ఆర్డీవో కార్యాలయా లు, రుద్రంగిలో 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములు, సిరిసిల్ల, వేముల వాడలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుతో పాటు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడ తారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో నేత బజా ర్‌ను రూ6 కోట్లతో కమిషనర్ మంజూరు చేశారు. సిరిసిల్లలో నిర్మించిన ఇందిరా మహి ళ శక్తి భవనాన్ని కూడా ప్రారంభిస్తారు.
1600 మందితో బందోబస్తు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ప్రశాం తంగా సాగే విధంగా పోలీసులు 1600 మం దితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశా రు. ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, ఆర్‌ఐ, 148 మంది ఆర్‌ఎస్‌ఐలు, 328 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబులు, 482 మంది కానిస్టేబుళ్లు, 121మంది మహిళా కానిస్టేబు ళ్లు, 196 మంది హోంగార్డులు, 60 మంది బెటాలియన్ సిబ్బంది, 190మంది డిస్ట్రిక్ట్ గార్డ్ బందోబస్తులో విధులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో హెలిపాడ్ ఏర్పా టు చేశారు. సిరిసిల్ల కోర్టు చౌరస్తా మీదు గా బహిరంగ సభ వరకు ఉన్న హోట ళ్లు, దుకాణాలు మూసివేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. పాఠశాల లకు కూడా మధ్యా హ్నం వరకే నిర్వ హించే విధంగా డీఈవో ఆదేశాలు ఇచ్చారు.
పర్యవేక్షించిన ఉన్నతాధికారులు
ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటన నేపథ్యం లో మంగళవారం రోజున మల్టీ జోన్-1 ఐజీ పీ చంద్రశేఖర్‌రెడ్డి, వీబీ కమలాసన్‌రెడ్డి, సీఎం భద్రత విభాగం ఎస్పీ చక్రవర్తి, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రలతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం హెలీ ప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో రిహార్సల్స్ నిర్వహించి, రూట్ క్లియరెన్స్ ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల కాన్వాయ్ రాకపోకలు, బారికేడ్ల ఏర్పాటు తదితర భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీ లించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు.