Share News

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..

ABN , Publish Date - Feb 26 , 2026 | 12:15 AM

జిల్లాలో నిర్వహించే పదో తర గతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు..

సిరిసిల్ల, ఫిబ్రవరి 25 (ఆంధజ్యోతి) : జిల్లాలో నిర్వహించే పదో తర గతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు వచ్చేనెల 14వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు నిర్వహించనున్నారని తెలిపారు. 7317 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద పరీ క్ష జవాబు పత్రాలు, ప్రశ్నపత్రాలు తరలించే సమయంలో పటిష్ఠంగా బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్ష జరుగుతున్నంత సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫ రా చేయాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష సమయం అనుకూలంగా తగినంత బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించాలని, పరీక్షలు కొనసాగే సమయంలో సమీప జిరాక్స్‌ సెంటర్లను మూసివేయాలని సూచించారు. ఆయా పరిధిలో ఉన్న మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవో లు పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో కావల్సిన వసతులను ఏర్పాటు చేయాలని, ఏఎన్‌ఎంను అందుబాటులో ఉంచి సేవలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా ఆయా ప్రదేశాల్లో వెళ్లే ఆర్టీసీ బస్సులు సమయ పాలన పాటించాలని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, డీటీవో నవీన్‌ కుమార్‌, ఆర్టీసీ, పోస్టల్‌, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2026 | 12:15 AM