ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:16 AM
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వ హణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వ హణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం అదనపు ఎస్పీ చంద్ర య్యతో కలిసి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబం ధిత శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అద నపు కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రా లను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరా దని, గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ అను మతించరాదని ఆదేశించారు. వేసవి దృష్ట్యా వైద్య శాఖ అధికారులు పరీక్షాకేంద్రాల్లో మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్‌కుమార్, వైద్య ఆరోగ్య, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, పోస్టల్, ఇంటర్మీడియ ట్ విద్య, ఆర్టీసీ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.