పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:49 AM
జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పక డ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పక డ్బందీగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. పదో తరగతి పరీక్షలు ఈనెల 14వ తేదీ నుంచి నిర్వహించనున్నారని తెలిపారు. 7317 మంది విద్యా ర్థులు పదో తరగతి పరీక్షలు రాసేందుకు 34 పరీక్ష కేంద్రాల ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష జవాబుపత్రాలను ప్రశ్నపత్రాలను తరలించే సమయం లో పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికా రులను ఆదేశించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో నిరం తరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష సమయం అనుకూలంగా తగినంత బస్సులను నడ పాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ప్రదేశాల్లో వెళ్లే ఆర్టీసీ బస్సులు సమ యపాలన పాటించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్షలు కొనసాగే సమయంలో సమీప జిరాక్స్ సెంట ర్లను మూసివేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో వసతు లను తగిన వసతులు కల్పించాలని తెలిపారు. ఏఎన్‌ఎంను అందుబా టులో ఉంచి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ చంద్రయ్య, డీటీఓ నవీన్ కుమార్, జిల్లా వైద్యాధికారి రజిత, ఆర్టీసీ, పోస్టల్, వైద్య శాఖ అధికారు లు తదితరులు పాల్గొన్నారు.