Share News

ఆ ఇద్దరు ఏకమయ్యారు..

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:43 AM

నిన్న, మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండగా, ఆ ఇద్దరిని మున్సిపల్‌ ఎన్నికలు ఏకం చేశాయి. ఇద్దరం రెండు వర్గాలుగా విడి పోయి మనం, మనం కొట్లాడుకుంటే ఇతర పార్టీల నాయకులు అవకాశంగా మారుతున్న సత్యాన్ని ఆలస్యం గానైనా గ్రహించారు.

ఆ ఇద్దరు ఏకమయ్యారు..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

నిన్న, మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండగా, ఆ ఇద్దరిని మున్సిపల్‌ ఎన్నికలు ఏకం చేశాయి. ఇద్దరం రెండు వర్గాలుగా విడి పోయి మనం, మనం కొట్లాడుకుంటే ఇతర పార్టీల నాయకులు అవకాశంగా మారుతున్న సత్యాన్ని ఆలస్యం గానైనా గ్రహించారు. ఇద్దరం కలిస్తే పార్టీ శ్రేణులంతా ఒక్కతాటిపైనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటు పడతారని భావించారు. మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేయడంతో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి, బీజేపీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌ వర్గీయులు కలిసిపోయారు. గతంలో పార్టీ కార్యక్రమా లను పోటాపోటీగా నిర్వహించినట్లుగా గాకుండా గత పదిహేను రోజులుగా అంతా ఒక్కటై కార్యక్రమాలను నిర్వహిస్తుండడంతో బీజేపీ వర్గాల్లో జోష్‌ పెరిగింది. పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీల్లో అందరిని కలుపుకునిపోయి మెజారిటీ స్థానాలను దక్కించుకునేం దుకు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ప్రదీప్‌కుమార్‌ వ్యూహ రచన చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఇరు వర్గాలు కలిసి పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.

పెద్దపల్లి మున్సిపాలిటీలో 36 వార్డులు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపాలిటీలో కొంతం శ్రీనివాస్‌రెడ్డి, రాజమహంతకృష్ణలు గెలుపొందగా, సుల్తానాబాద్‌లో ఖాతా తెరవ లేదు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయమని నిరూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్టీ నాయకులు నల్ల మనోహర్‌ రెడ్డి, గొట్టెముక్కుల సురేష్‌ రెడ్డిలను సైతం కలుపుకుని పని చేయాలని నిర్ణయించారని సమాచారం. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా వార్డుల్లో పోటీ చేసేందుకు ఎవరెవరు ఆసక్తి చూపుతున్నారో వారి వివ రాలను సేకరిస్తున్నారు. సమర్థులకు టికెట్లు ఇప్పించి వారి గెలుపు కోసం కృషి చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీలకు చెందిన వారిని పార్టీలో చేర్పించుకుని పోటీలో నిలపాలని నిర్ణయించా రని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఫ జిల్లాపై దృష్టి సారించిన రాష్ట్ర అధ్యక్షుడు..

జిల్లాలో భారతీయ జనతా పార్టీ నేతల మధ్య వర్గ విబేధాలతో కార్యకర్తలు సతమతం అవుతుండడంతో పార్టీని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు దృష్టి సారించారు. ఆయన అధ్యక్షుడిగా నియా మకమైన తర్వాత ఆరు మాసాల క్రితం పార్టీలో నల్ల మనోహర్‌రెడ్డి చేరిక సందర్భంగా పెద్దపల్లిలో నిర్వహిం చిన కార్యక్రమానికి హాజరయ్యారు. రాంచందర్‌ రావు ఎదుటే గుజ్జుల, దుగ్యాల వర్గీయులు వాగ్వాదాలకు దిగి తోపులాడుకున్న విషయం తెలిసిందే. అలాగే రామ గుండం, మంథని నియోజకవర్గాల్లోనూ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడాన్ని గమనించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు జిల్లాపై దృష్టి సారించారు. దీనికి తోడు పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవ రెడ్డి వైఖరి, ఆయన వ్యవహారశైలి, అనుసరిస్తున్న విధానాలు ఆయా గ్రూపుల మధ్య అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యిం దని పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చర్చ జరిగింది. ఆయన తీరుపై ఆయా వర్గాలు రాష్ట్ర అధ్యక్షుడికి సైతం కొందరు ఫిర్యాదులు అందించాయని తెలుస్తున్నది. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు కేవలం నాలుగు స్థానాల్లో గెలుపొందడంతో రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపై ఫోకస్‌ పెట్టారు. పట్టణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి పట్టు ఉంటుంది. ఆ పట్టు చేజారి పోకుండా ఉండేందుకు అన్ని వర్గాలను ఏకం చేస్తున్నారు. పెద్దపల్లిలో గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌లు ఏకం కావడం పార్టీకి కలిసి రానున్నది. రామగుండం కార్పొరేషన్‌లో కూడా గత ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అక్కడున్న నాయకులందరినీ సమన్వయ పరిచి ఎక్కువ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా చర్యలు చేపడుతున్నారు. మంథని మున్సిపాలిటీలో కూడా బల మైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌లు ఇన్నాళ్లు వేర్వేరుగా ఉన్న కారణంగా వారి ప్రభావం మొత్తం జిల్లాపై పడింది. ఇప్పుడు వారిద్దరు కలిసి పోవడం వల్ల పార్టీకి శుభపరిణా మమని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతారో వేచిచుడాల్సిందే.

Updated Date - Jan 24 , 2026 | 12:43 AM