వైభవంగా తిరువాభరణోత్సవం
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:12 AM
సిరిసిల్ల హరిహర పుత్ర అయ్యప్ప స్వామి తిరువాభరణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
సిరిసిల్ల, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల హరిహర పుత్ర అయ్యప్ప స్వామి తిరువాభరణోత్సవం బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి ఆభరణాలకు పూజలు నిర్వహించిన అనంతరం డప్పుచప్పుళ్లతో ఎంతో కోలాహలంగా అయ్యప్పస్వాము లు శోభాయాత్రగా హరిహరపుత్ర దేవాలయానికి తీసుకెళ్లారు. ప్రత్యేక పడిపూజ నిర్వహించిన అనంతరం మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప స్వాములు పులకిం చిపోయారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు రాచ విద్యాసాగర్, విశ్వనాథం, సురేష్ తదితరులు పాల్గొన్నారు.