రెండున్నరేళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:24 AM
తమపై విమర్శలు చేసే ముందు అభివృద్ధి చేయడంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని, ప్రతిసారీ బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిపై విమర్శ లు చేయడం కాకుండా ముందు మీరు రెండున్నర ఏళ్లుగా కొత్త పని ఏం చేశారో ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారా వు డిమాండ్ చేశారు.
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తమపై విమర్శలు చేసే ముందు అభివృద్ధి చేయడంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని, ప్రతిసారీ బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిపై విమర్శ లు చేయడం కాకుండా ముందు మీరు రెండున్నర ఏళ్లుగా కొత్త పని ఏం చేశారో ప్రజలకు చెప్పాలని బీఆర్‌ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారా వు డిమాండ్ చేశారు. బుధవారం వేములవాడలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేవాలయానికి రూ.150 కోట్లు వెచ్చించాం అంటున్నారని, ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారన్నారు. భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. గుడి చెరు వులో 35ఎకరాల భూమిని సేకరించింది ఎవరని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని అన్నారు. 100 పడకల ఆసుపత్రి కట్టింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం కదా అని అన్నారు. గుడిచెరువు కట్ట సుందరీకరణ, మిడ్‌మానేరు నుంచి గుడి చెరువులోకి కొత్త పైపులైన్ తాము చేసింది కాదా అని అన్నారు. మీ పార్టీలో గెలిచిన వారికి వైస్ చైర్మన్ ఎందుకు ఇవ్వలేదని, తమ పార్టీ నుంచి గెలిచిన వారికి ఎందు కు ఇచ్చారని అని ప్రశించారు. వేములవాడ మున్సిపల్‌లో గెలిచిన అభ్యర్థుల అందరికీ శుభాకాంక్షలని తెలిపారు. ఈ సమావేశంలో వేము లవాడ పట్టణ కౌన్సిలర్‌లు రామతీర్థపు మాధవి, వెంగళ అనిత, వాసా ల లావణ్య సీనియర్ నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్‌లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేశ్, గన్నమనేని రామారావు, సిరిగిరి చం దు, నాయకులు గుడూరి మధు, సదానందం, తదితరులు ఉన్నారు.