లెక్క తేల్చారు..
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:56 AM
జనగణనలో భాగంగా గృహగణన ప్రక్రియ రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం మంగళవారం విజయవంతంగా ముగించింది. రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి శెభాష్ అనిపించుకున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
జనగణనలో భాగంగా గృహగణన ప్రక్రియ రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం మంగళవారం విజయవంతంగా ముగించింది. రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి శెభాష్ అనిపించుకున్నారు.
ప్రజా సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పథకాలకు కీలకంగా ఉండే జనగణనలో తొలివిడత గృహగణన లెక్క తేల్చారు. ప్రభు త్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే పక్కాగా జనాభా లెక్కలు ఉండాలి. ఈ ప్రక్రియను ప్రతి పదేళ్లకు ఒకసారి నిర్వహి స్తారు. 2011 చేపట్టాల్సి ఉండగా కొవిడ్ కారణంగా వాయిదా పడింది. 15 ఏళ్ల తర్వాత జనగణనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జనగణన - 2027లో భాగంగా చేపట్టిన గృహ, జనగణనలో 100 శాతం గడువు కంటే ముందే పూర్తిచేసి రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలోని ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ నెల 11న ప్రారంభమైన గృహగణన జూన్ 9 వరకు కొనసా గింది. జిల్లాలో 1,126 గృహగణన బ్లాక్‌ల ద్వారా 2లక్షల 11 వేల 827 ఇళ్లు, 1,66,828 కుటుంబాలు, 5.84 జనాభా ఉన్నట్లు లెక్క తేల్చారు. జిల్లాలో ఎక్కువ కుటుంబాలు, జనాభాలో సిరిసిల్ల ఉండగా, అతితక్కువలో వీర్నపల్లి ఉంది. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 27,884 కుటుంబాలు ఉండగా , 97,410 జనాభా ఉంది. అతి తక్కువగా వీర్నపల్లి మండలంలో 3,884 కుటుంబాలు ఉండగా, 14,849 జనాభా ఉంది. జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి శ్రీనివాసచారి పర్యవేక్షిస్తున్నారు. డివిజన్లలో ఆర్డీవోలు, డీఈవో, డీఏవో, జడ్పీ సీఈవో, డీపీవో, ఏడీసీవో తదితర అధికారులు ఉన్నారు. మండలాల్లో చార్జి ఆఫీసర్లుగా తహసీల్దార్లు, అడిషనల్ చార్జి ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, ఎంపీఈవోలు, మున్సిపాలిటీలో చార్జి ఆఫీసర్‌గా మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా మేనే జర్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 1,025 మంది వరకు ఎన్యూమ రేటర్లు,173 మంది సూపర్‌వైజర్లను నియమించారు. జిల్లాలో 12 మండ లాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల ఆధారంగా 700 నుంచి 800 మందికి ఒక బ్లాక్‌గా జిల్లాలో 1,126 హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లుగా విభజించారు. ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌గా జిల్లాలో 173 మందిని నియమించి సర్వే చేయించారు. మొదటి దశలో ఒక్కో ఎన్యూమరేటర్‌కు కేటాయించిన 200 ఇండ్లకు వెళ్లి వివరాలను సేకరించి గృహ జనగణనను విజయవంతంగా పూర్తి చేశారు.
జిల్లాలో 1,66,823 కుటుంబాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో గృహ, జనగణన లెక్క తేలింది. క్షేత్రస్థాయిలో అధికారులు, ఎన్యూమరేటర్లు సర్వే జరిపి జిల్లాలో 2 లక్షల 9 వేల 219 ఇండ్లు ఉంటా యని అంచనా వేసి క్షేత్ర స్థాయిలో గృహగణన పూర్తయ్యేసరికి 2లక్షల 11 వేల 827 ఇండ్లు గుర్తించారు. ఇందులో 1,66,823 కుటుంబాలు, 5 లక్షల 84 వేల 62 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. 2011 జనాభా లెక్కల ప్రకా రం జిల్లాలో 1,38,992 కుటుంబాలు ఉండగా, జనాభా 5,52,037 మంది ఉన్నారు. గృహగణన పూర్తి కావడంతో జిల్లాలో 27 వేల 831 కుటుంబాలు. జనాభాలో 32 వేల 25 మంది పెరిగారు. ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న జనాభా సంఖ్య, ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయని వివరాలు సేకరించారు. వచ్చే సంవత్సరం ఇతర అంశాలతో జనగణన చేపడతారు. వాస్తవ జనా భా సంఖ్య రెండో విడత జనాభా గణన తర్వాత తెలుస్తుంది. గృహ గణనలో అడిగే 33 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడానికి ఎన్యూమరేటర్లు నానా తంటాలు పడ్డారు. ప్రతి ఇంటిని సందర్శించిన ఎన్యూమరేటర్లు ఇంటి స్వరూపంతో పాటు గృహస్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య ఇంట్లో నివసించే వారి సంఖ్య కారు, జీపు, వ్యాన్, ద్విచక్ర వాహనాలు సైకిల్ వంటి వివరాలే కాకుండా టీవీ, రేడియో, గ్యాస్ కనెక్షన్, టెలిఫోన్, మొబైల్, స్మార్ట్‌ఫోన్, మొబైల్ నెంబర్ వంటి వాటితో పాటు కుటుంబం సామాజిక వర్గం ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాలకు చెందిన వారి వివరాలు కూడా సేక రించారు.
మండలాల వారీగా జనగణన
మండలం కుటుంబాలు జనాభా
రుద్రంగి 4577 16738
చందుర్తి 10011 33313
వేములవాడ రూరల్ 6477 22344
బోయిన్‌పల్లి 10533 34608
వేములవాడ 6061 20513
కోనరావుపేట 12552 44039
వీర్నపల్లి 3884 14849
ఎల్లారెడ్డిపేట 14402 50946
గంభీరావుపేట 13283 46177
ముస్తాబాద్ 13205 47641
సిరిసిల్ల మున్సిపల్ 27884 97414
తంగళ్లపల్లి 14958 52684
ఇల్లంతకుంట 14113 48501
వేములవాడ మున్సిపల్ 14888 54299
మొత్తం 166828 584062