Share News

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:53 AM

వేసివిలో తాగునీట ఎద్దడి లేకుండా చూడాలని అలాగే నిత్యం తాగునీరు సరఫరా జరిగేలా చూడా లని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : వేసివిలో తాగునీట ఎద్దడి లేకుండా చూడాలని అలాగే నిత్యం తాగునీరు సరఫరా జరిగేలా చూడా లని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. సిరిసి ల్ల సమీకృత కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్‌లు, నీటి పారుదల శాఖ, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో తాగునీరు, పారుశుధ్య పనులపై సమీక్షించారు. ముందుగా మున్సిపాల్టీలు, అన్ని మండలాల వారీ గా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా లక్ష్యం ఎంత సరఫరా అవుతుందని స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని మున్సిపల్‌ కమిషనర్‌లతో పాటు ఎంపీడీవోలు, మిషన్‌ భగీరఽథ ఏఈలను అడిగి తెలుసుకు న్నారు. తాగునీరు సరఫరా కోసం ఇంకా ఏమికావాలో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ.. ప్రతి మున్సిపాలిటీ, గ్రామా ల్లో తాగునీరు సరఫరా, పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిం చారు. వేసవి నేపథ్యంలో రానున్న 45 రోజులు చాలా కీలకమని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథ ద్వారా లక్ష్యం మేరకు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డు, విలీన ప్రాంతాలు, అన్ని మండలాల్లోని గ్రామాలు, చివరి ప్రాంతాలకు నీరు సరఫరాలో ఎక్కడా ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళిక తో ముందుకువెళ్లాలని ఆదేశించారు. నీటి టాంక్‌లు, పైప్‌లైన్‌లలో లీకేజీ లేకుండా చూడాలని, ఇన్‌టేక్‌ వెల్‌, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో మోటార్లు ఎప్పుడూ నడి చేలా ఏర్పాట్లుచేసుకోవాలని, ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. నీటి పారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్ట్‌లో నీటి మట్టాన్ని పరిశీలించాలన్నారు. నీటి సరఫరాలో ఇబ్బందులు వస్తే స్థానికంగా ఉన్న వనరులను వినియోగించాలని తెలిపారు. నీటిని రోజూ క్లోరినే షన్‌ చేయించాలని, పది రోజులకు ఒకసారి నీటి టాంక్‌లు శుభ్రం చేయించాలని ఆదేశించారు. అమృత్‌ పథకం కింద జిల్లాలో మొదలుపెట్టిన ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేసి.. వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇబ్బందులుంటే జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్ట ర్‌ గడ్డం నగేష్‌, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ అమరేం దర్‌, మిషన్‌ భగీరథ ఈఈలు అన్వర్‌, సుమలత, పబ్లిక్‌హెల్త్‌ ఈఈ సంపత్‌, డీఆర్డీవో గీత, సీపీవో శ్రీనివాసా చారి, జడ్పీ సీఈవో వినోద్‌ కుమార్‌, డీపీవో షర్ఫుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:53 AM