Share News

ఎరువుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూడాలి

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:21 AM

జిల్లాలో ఎరువుల కొరత లేదని, పంపిణీలో ఇబ్బందులు రాకుం డా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు.

ఎరువుల పంపిణీలో ఇబ్బందులు రాకుండా చూడాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎరువుల కొరత లేదని, పంపిణీలో ఇబ్బందులు రాకుం డా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లాలోని మండలాల వ్యవసాయ అధికారులు, ఎస్‌హెచ్‌వోలు, తహసీల్దార్లతో ఎస్పీ మహేష్‌ బీగీతేతో కలిసి ఇన్‌చార్జి కలెక్టర్‌ వీడీయోకాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఎరువుల పంపిణీ, ఇతర అంశాల పరిశీలన,జిల్లా, మండల టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం లక్షా 87 వేల ఎకరాల్లో వివిధ పంటల సాగు అవుతున్నాయని, దానికి 21వేల మెట్రిక్‌ టన్నుల యూరి యా అవసరం ఉంటుందన్నారు. ఇప్పటివరకు 13 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల విక్రయాలు జరిగాయని వెల్ల డించారు. ఇంకా రెండు వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎరువుల ఇబ్బం దులు రాకుండా సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని అపెరల్‌ పార్కులో నిల్వ చేశామన్నారు. పంటల సాగుకు అనుగు ణంగా ఎరువులను తెప్పిస్తున్నామన్నారు. సింగిల్‌విండో లు, ఐకేపీ, డీసీఎంఎస్‌, ప్రైవేటు డీలరులు ఈ పాస్‌ యంత్రాలతోనే ఎరువులను విక్రయించి రిజిస్టర్లలో పట్టా దారు పాసుపుస్తకం రైతుల వివరాలు నమోదు చేయా లని ఆదేశించారు. సింగిల్‌విండోల వద్ద రైతుల కోసం టెంట్‌లను వేయించడంతోపాటు తాగునీటి వసతి కల్పిం చాలని ఆదేశించారు.

టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ల తనిఖీలు చేయాలి

జిల్లాలో ఎరువుల పంపిణీ, నిల్వలతోపాటు తదితర అంశాలన టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు తనిఖీ చేయాలని ఇన్‌ చార్జి కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా మండల స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ టీంలు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాస్థాయి టీమ్‌ లో కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్‌, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార అధికారి, డీఆర్‌డీవో, మార్క్‌ ఫెడ్‌ డీఎం తదితరులు ఉంటారని ఇన్‌చార్జి కలెక్టర్‌ తెలి పారు. అలాగే మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లో తహసీల్దార్‌, మండల వ్యవసాయ అధికారి, ఎస్‌ హెచ్‌వోలు ఉంటారని వెల్లడించారు మండల స్థాయి టీమ్‌లు తమ పరి ధిలోని రెండుషాపులను రోజూ తని ఖీ చేయాలని సూచించారు. ఏమై నా తేడాలుంటే మండల వ్యవసా య అధికారి ద్వారా ఉన్నతాధికారు ల దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. ఎరువుల దుకాణాల వద్ద రద్దీని నియంత్రించాలని, ఎరువుల కొరత ఉందని చేసే అసత్య ప్రచారాలను నియంత్రించా లని సూచించారు. ఎరువులు వ్యవసాయానికి వినియో గించేలా చూడాలని, పక్కదారి పట్టించి ఇతర అవసరా లకు వాడకుండా పర్యవేక్షించాలని టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ల కు ఎస్పీ మహేష్‌ బి గితే సూచించారు. అనవసర ఆం దోళనలు, అసత్య ప్రచారాలు చేసే వారిపై దృష్టి సారిం చాలని ఆదేశించారు.సరైన లైసెన్ప్‌లు లేకుండా ఎరువుల విక్రయాలు, నకిలీ ఎరువుల విక్రయాలపై దృష్టి సారిం చాలన్నారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, డీఆరీవో గీత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, తదితరులున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 12:21 AM