సమృద్ధిగా వర్షాలు పడాలి.. పంటలు పండాలి
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:15 AM
శ్రీసీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని రాష్ట్ర బీసీ సంక్షే మ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
వేములవాడ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): శ్రీసీతారాముల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని రాష్ట్ర బీసీ సంక్షే మ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. శ్రీరామ నవమి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న శివార్చన స్టేజీ వద్ద శ్రీసీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి సమర్పించారు. భీమన్న ఆలయానికి విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి భీమన్న ఆలయంలోకి ప్రవేశించగా ఆల య అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీస్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వనం అందించగా ఆలయ ఈవో రమాదేవి శ్రీస్వామి వారి శేషవస్ర్తాలు, రాజన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ శ్రీసీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించామని తెలిపారు. శ్రీస్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం లో ప్రజలందరు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నామని అన్నారు. వారి వెంట కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బీ గితే, రాజన్న ఆల య ఈవో రమాదేవి ఆలయాధికారులు ఉన్నారు.
వైభవంగా సీతారాముల కల్యాణం : విప్
వేములవాడ రాజన్న, భీమన్న ఆలయ క్షేత్రంలో శ్రీసీతారాముల కల్యా ణం వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కల్యాణం సంప్రదాయంగా వస్తుందని వివరించారు. కల్యాణానికి 50 వేలకు పైగా భక్తులు వస్తారనే అంచనా మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చలువ పందిళ్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. నూతన వేదిక వద్ద శ్రీ శివపార్వతుల, శ్రీసీతారాముల కల్యాణం వేడుకలు దేవాదాయ శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ది, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నా యని వివరించారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేష్, కౌన్సిలర్లు ఉన్నారు.