ముఖ్యమంత్రి మాటల్లో వాస్తవం లేదు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:58 AM
సిరిసిల్లలో 8వేల ఎకరాలు బీఆర్‌ఎస్ నాయకు లు కబ్జా చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రక టించడంలో వాస్తవం లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్లలో 8వేల ఎకరాలు బీఆర్‌ఎస్ నాయకు లు కబ్జా చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రక టించడంలో వాస్తవం లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. మంగళ వారం జిల్లా కేంద్రం బీఆర్‌ఎస్ భవన్‌లో విలేక రుల సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్ మాట్లాడారు. శాసన సభ సమావేశంలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడా డని, సిరిసిల్లలో 8వేల ఎకరాలు బీఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేశారంటూ ప్రకటించడంలో వాస్తవం లేదన్నారు. 8 వేల ఎకరాలతో పాటు జిల్లాలో రికవరి చేసిన 2400 ఎకరాల భూమి పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో గ్రామాల వారిగా పేర్లతో సహా శ్వేతపత్రం విడదల చే యాలని డిమాండ్ చేశారు. ఈ భూములన్నిం టిపైన బీఆర్‌ఎస్ పార్టీ పక్షాణ న్యాయపోరాటం చేస్తామని కలెక్టర్ నుంచి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం తీసుకోవడానికి అర్జీ పెట్టడానికి వెళ్తున్నామన్నారు. శాసన సభలో ముఖ్యమంత్రి తన ప్రకటనలో వాస్తవం లేదని గమనించి ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని బీఆర్‌ఎస్ పార్టీ, కేటీఆర్‌పై వేసిన అభాండాలకు సిరిసిల్ల ప్రజల కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పును ఒప్పుకొని జిల్లా కేంద్రంలోని అంబేద్క ర్ చౌరస్తాలో రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రా యాలని, రేవంత్‌రెడ్డి ఆరోపణలు వాస్తవాలైతే జిల్లా అధ్యక్షుడిగా తాను ముక్కు నేలకు రాస్తా నని, తన సవాల్ స్వీకరించాలన్నారు. వేముల వాడ శాసనసభ సభ్యుడు ఆది శ్రీనివాస్ పగటి కలలు కంటున్నారని కేసీఆర్, కేటీఆర్‌లపై ఆరో పణలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నా రు. కేసీఆర్, కేటీఆర్‌లపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ కాలయాపణ చేస్తున్నాడన్నారు. ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అబద్దాలు చెపుతూ ప్రజల ను అయోమయానికి గురిచేస్తూ తనస్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపిం చారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్, మాజీ కౌన్సిలర్లు గుండ్లపెల్లి పూర్ణచందర్, గెంట్యాల శ్రీనివాస్, లింగంపల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చంద్రయ్యగౌడ్, జిల్లా నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, బొల్లి రామ్మోహన్, కుంభాల మల్లా రెడ్డి, స్వాతి, కొండ శంకర్, కాసర్ల మహేందర్, సాయికృష్ణ, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ పాల్గొన్నారు.