Share News

జిల్లాలో యూరియా కొరత లేదు

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:01 AM

జిల్లాలో యూరియా కొరత లేద ని, రైతులు ఆందోళన చెందకుండా యాప్‌ ను అప్డేట్‌ చేసుకుని యూరియా కోసం బుకింగ్‌ చేసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు.

జిల్లాలో యూరియా కొరత లేదు

సిరిసిల్ల అర్బన్‌, జూన్‌ 30 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో యూరియా కొరత లేద ని, రైతులు ఆందోళన చెందకుండా యాప్‌ ను అప్డేట్‌ చేసుకుని యూరియా కోసం బుకింగ్‌ చేసుకోవాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ కోరారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ లో మంగళవారం ఫెర్టిలైజర్‌ యాప్‌, ఎరు వుల సరఫరా తదితర అంశాలపై అద నపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్యలతో పాటు వ్యవసాయ శాఖ ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఫెర్టిలైజర్‌ యాప్‌ సేవలు రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నా రు. ఈ సీజన్‌లో 19వేల 513 మంది రైతులు 60వేల 254 యూరియా సంచులను యాప్‌లో బుకింగ్‌ చేసుకున్నారని వివరించారు. తమ సమీపంలోని దుకాణాల నుంచి 50వేల 283 యూరియా బస్తాలను రైతులు తీసుకెళ్లారని ఇంకా 9830 యూరియా బస్తాలు తీసుకెళ్లాల్సి ఉందన్నారు. జిల్లాలో ఇంకా 12వేల 292 బస్తాలు నిల్వ ఉన్నాయని వెల్ల డించారు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 20 రైతు వేధికలు, అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద ఎరువులు నిల్వ ఉన్నా యని అన్నారు. రైతులకు సహాయం చేసేందుకు అన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఉన్నారన్నారు. ఫెర్టిలైజర్‌ యాప్‌లను అప్డేట్‌ చేసుకుని యూరియా నిల్వలు దానిలో చూపించక పోతే ఆందోళనకు గురికాకుండా దానిని రిఫ్రెష్‌ చేసుకోవా లన్నారు. రైతులు ఎవరైనా యూరియా సరఫరాలో సమ స్యలు ఉంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్ర దించాలన్నారు. అవసరానికి మించి యూరియా కొనుగోళ్లు చేయకుండా శాస్త్రీయ పద్ధతిలో వినియోగించాలన్నారు. కొందరు సోషల్‌ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న అసత్య ప్రచారాలను రైతులు నమ్మవద్ద న్నారు. పంటల సాగుకు అనుగుణంగా ఎరవులు అందు బాటులో ఉంటాయని ఈ సీజన్‌కు సరిపడా ఎరువులు నిల్వలు జిల్లాలో సిద్ధంగా ఉంచాలని మార్క్‌ఫెడ్‌ అధికారు లను ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షిం చాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌, మార్క్‌ఫేడ్‌ అధికారి హబీబ్‌ తది తరులు పాల్గోన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 12:01 AM