Share News

జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:19 AM

జిల్లాలో గ్యాస్‌ సిలిండర్లకు కొర తలేదని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ స్పష్టం చేశారు.

జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదు

సిరిసిల్ల, మార్చి 13 ( (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్యాస్‌ సిలిండర్లకు కొర తలేదని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ స్పష్టం చేశారు. శుక్రవారం ఎనర్జీ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహే ష్‌ బీ గీతేతో కలిసి సిలిండర్ల పంపిణీ, స్టాక్‌ తదితర అంశాలపై కలెక్టరే ట్‌లో కమిటీ సభ్యులు, సిలిండర్‌ ఏజెన్సీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎనర్జీ మానిటరింగ్‌ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌, కన్వీనర్‌ గా జిల్లా పౌరసరఫరాల అధికారి, సభ్యులుగా వివిధ శాఖల అధికా రులు ఉంటారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లా లో సిలిండర్ల నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు పడవద్దని, వదంతులు నమ్మవద్దని సూచించారు. గృహ వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా గ్యాస్‌ బుకింగ్‌ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ సూచించిన ధరలకు మాత్ర మే సిలిండర్లను విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లు, అనాథ శ్రమాలు, ఆస్పత్రులకు ఇబ్బంది లేకుండా సిలిండర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్‌ బి గితే మాట్లాడుతూ గ్యాస్‌ సిలిండర్లను పక్కదారి పట్టించవద్దని, బ్లాక్‌ దందా చేయవద్దని సూచించారు. సిలిండర్‌ పక్కదారి పట్టినా, బ్లాక్‌ దందా చేసినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదన పు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా పౌర సరఫరాల అధికారి రాధాభాయ్‌, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రవీందర్‌రెడ్డి, అఫ్జల్‌ బేగం, సౌజన్య, రూపేష్‌, లక్ష్మీరాజం, రజిత, గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 12:20 AM