Share News

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:12 AM

: యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి అన్నారు. జమ్మికుంట మండలం విలాసాగర్‌ గ్రామంలో డ్రగ్స్‌, అక్రమ ఇసుక రవాణాపై శనివారం అవగాహన కల్పించారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

జమ్మికుంట రూరల్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హుజూరాబాద్‌ ఏసీపీ మాధవి అన్నారు. జమ్మికుంట మండలం విలాసాగర్‌ గ్రామంలో డ్రగ్స్‌, అక్రమ ఇసుక రవాణాపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసై తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడవద్దని, చట్టాన్ని గౌరవించాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణ, ప్రజల భద్రత పెంపు వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. గ్రామంలో ప్రజల సహకారంతో సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఎస్‌ రామకృష్ణగౌడ్‌, సర్పంచ్‌ గరిగంటి శ్రీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:12 AM