యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:03 AM
సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిపై యువత అప్రమత్తంగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాల, జూన 26(ఆంధ్రజ్యోతి): సమాజాన్ని పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిపై యువత అప్రమత్తంగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు. యాంటీ డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా సే నో టు డ్రగ్స్ 3కే రన కార్యక్రమాన్ని ఐఎంఏ ఆధ్వర్యంలో స్థానిక మినీస్టేడియం నుంచి ఐఎంఏ హాల్ వరకు ఈ త్రీకే రనను నిర్వహించారు. రనను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. అలాంటి యువత డ్రగ్స్‌కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ అశోక్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, మున్సిపల్ ఛైర్‌పర్సన సమిండ్ల వాణిశ్రీనివాస్, డీఎంహెచవో సుజాత, డీఎస్పీ పురుషోత్తం, కమిషనర్ సత్యప్రణవ్, ఐఎంఏ అధ్య క్షుడు డాక్టర్ గూడూరి హేమంత, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ట్రెజరర్ డాక్టర్ సుధీర్, కౌన్సిలర్లు, వైద్యులు, పట్టణ నాయకులు, వాకర్స్, ప్రెస్‌క్లబ్ సభ్యులు తదితరులున్నారు.