మోదీ మోసపూరిత విధానాలపై యువత పోరాడాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:44 PM
ప్రధానమంత్రి మోదీ మోసపూరిత విధా నాలపై యువత పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి స్కైలాబ్‌బాబు అన్నారు.
కోనరావుపేట, జూలై 19 (ఆంధ్రజ్యోతి) : ప్రధానమంత్రి మోదీ మోసపూరిత విధా నాలపై యువత పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి స్కైలాబ్‌బాబు అన్నారు. ఆదివారం కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో సీపీఎం మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీపీఎం శాఖలు ఫ్రాక్షన్ కమిటీలు పార్టీ నిర్మా ణం పని పద్ధతులు అనే అంశంపై ఆయన క్లాస్ బోధించారు. ఈ తరగతులకు సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు జవ్వాజి విమల ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. అనం తరం మాట్లాడుతూ ప్రపంచంలో తూర్పు యూరప్ దేశాలన్నీ ఎరుపెక్కి అమెరికా సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించాయని గుర్తు చేశారు. అమెరికాకు అతి సమీపంలో ఉన్న క్యూబా అనే చిన్న దేశం అమెరికా ఆంక్షలకు ఏ మాత్రం తలొగ్గకుండా సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా సమరశీలంగా పోరాడుతుందన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం భారతదేశం లాంటి వెనుకబడిన దేశాలపై ఆంక్షలు విధిస్తూ ఆర్థిక పెత్తనానికి ఒడిగ డుతుందన్నారు. ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం చేసిన అమెరికా చివరికి తనం తట తానుగా వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. పెట్టుబడిదారీ వర్గాలు కార్మికుల శ్రమను దోచుకొని మరింత సంపద పోగు చేసుకుంటున్నాయని విమర్శించారు. దేశంలో 200 మంది శతకోటీశ్వరులు దేశ సంపదలో 50 శాతం వాటా కలిగి ఉన్నారని చెప్పారు. 80 కోట్ల మంది నేటికీ పేదరికంలో మగ్గుతున్నారని చెప్పారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా ను అమలు చేస్తూ దేశంలో అదానీ, అంబానీ లాంటి వాళ్లకు దేశ సంపదను కట్టబెడు తున్నారని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడే ఏకైక శక్తిగా ఎర్రజెండా ముందుకు నిలుస్తుందన్నారు. ఇటీవల ఎన్నికలలో కొన్ని ఎదురుదెబ్బలు తగి లినప్పటికీ భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందుతామని చెప్పారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌పై మోడీ ప్రభుత్వం కారణమైందన్నారు. నీట్ పేపర్ లీక్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సొన్‌వాంగ్ చుక్ 20 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నరేంద్ర మోదీ సర్కార్ మొండిగా వ్యవ హరిస్తోందన్నారు. సర్ పేరుతో కోట్లాది మంది పేదల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. వివిధ రకాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం రాజీలేని పోరాటాలు నిర్మిస్తుందన్నారు. భవిష్యత్తులో సీపీఎం నిర్మించబోయే ఉద్యమా లలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో 20 రోజుల పాటు సోన్‌వాంగ్ చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడానికి సీపీఎం ఖండిస్తూ జూలై 20న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో యువతరం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ తరగతులలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, ఎర్రవెల్లి నాగరాజు, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు గురిజాల శ్రీధర్, గణేష్, మల్లారపు ప్రశాంత్, పార్టీ నాయకులు ఎలిగేటి రాజశేఖర్, గీస బిక్షపతి, శ్రీరామ్, సదానందం, సురేష్ సిరిమల సత్యం, ఆడెపు రజిత, రామంచ అశోక్, కమ లాకర్, నక్క దేవదాస్, గిరిబాబు, కనకయ్య, కూచన శంకర్, మల్లయ్య, రవి, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.