సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:25 AM
సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
వేములవాడ, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పథకాలు అమలుచేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వ్యవసాయ శాఖ, స్ర్తీ, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధునీ కరణ యంత్రాలు, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్ర వారం వ్యవసాయ మార్కెట్ కమిటీలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్ర భుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి హాజరై లబ్ధిదారులకు యంత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రైతును రాజు గా చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు భీమా, సన్న వడ్లకు బోనస్‌తో పాటు రైతులకు ఇబ్బందులు తలేత్తకుండా అందుబాటులో కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పంటల కొనుగోలు చేస్తున్నదని వెల్ల డించారు. వ్యవసాయ ఆధునీకరణ కోసం సబ్సీడీపై వివిధ యంత్రాలు పం పిణీ చేస్తున్నదని తెలిపారు. ఆయా పరికరాలు, సబ్సిడీపై విస్తృత ప్రచారం చేయాలని, యంత్రాల కోసం జిల్లాలోని అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు యంత్రాలు..
వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీపై యంత్రా లు పంపిణీ చేస్తున్నదని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఆధునీకరణకు పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకుని, సాగును ఇంకా లాభసాటిగా చేయవచ్చన్నారు. అన్ని కాలాలకు అనుగకూలంగా ఉండే ఆయిల్‌పామ్ పంటల సాగు వైపు రైతులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు మద్దతుగా ఉంటారని తెలిపారు. దివ్యాంగురాలు ఐరా సింఘా ల్ యూపీఎస్సీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారని, ఆమెను ఆదర్శం గా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఆర్డీవో రాధాబాయి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు ఉన్నారు