పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:26 AM
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభు త్వ ధ్యేయమాని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
రుద్రంగి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభు త్వ ధ్యేయమాని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని యువత, విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి, ఉపాధి పొందేందుకు శిక్షణ అందించే అడ్వా న్స్ టెక్నాలజీ సెంటర్ కోసం రూ.42 కోట్లు మంజూరు చేసిందని, టెండర్లు పూర్తి అయ్యాయని త్వరలోనే పనులు మొదలు పెడుతామని తెలిపారు. టాటా కంపెనీ సహకారం, భాగస్వామ్యంతో దీనిలో మొత్తం ఆరు కోర్సు లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణానికి ఎకరాల ఎనిమిది స్థలం కేటాయించామని, నిర్మా ణ పనులు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. వేములవాడ నియోజకవ ర్గంలో రుద్రంగి రెండో అతి పెద్ద గ్రామమని తెలిపారు. విశాలమైన రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నామన్నారు. 132/33 సబ్ స్టేషన్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని, విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తామని భరో సా ఇచ్చారు. రుద్రంగి నుంచి కుక్కలగండి తండాకు బిటీ రోడ్డు మంజూ రు కావడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్పలత, సర్పంచ్ గండి నారాయణ, గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, పుట్కపు మహిపాల్, ఆకుల గగన్, ఎర్రం ఆరవింద్, పూదరి మహిపాల్, గంధం మనోజ్, అంబటి శ్రీనివాస్, తర్రె లింగం, పూన్నురి శ్రీను, తదిత రులు పాల్గొన్నారు.