Share News

ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:39 AM

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

ఇల్లంతకుంట, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కల్యాణమండపంలో మంగళవారం 72మంది లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద ప్రజలపాలిట వరం సీఎం సహాయనిధి అన్నారు. అత్యవసర అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయం అనేక కుటుంభాలకు బాసటగా నిలిచిందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషిచేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 25 విడుతలుగా చెక్కులు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీఓ శశికళ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, ఇల్లంతకుంట సర్పంచ్‌ మామిడి రాజు, నాయకులు పసుల వెంకటి, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, ఎలగందుల ప్రసాద్‌, కోలపురి అంతగిరి, తీగల పుష్పలత, బొల్లవేని రమేష్‌, నవీన్‌రెడ్డి, చంద్రారెడ్డి, నేరెళ్ళ విజయ్‌గౌడ్‌, మేడిపెల్లి భాస్కర్‌రెడ్డి, గొడుగు విఠల్‌, బాలమల్లు, మామిడి సంజీవ్‌ పాల్గొన్నారు.

సర్పంచ్‌లతో సమావేశం

మండలకేంద్రంలోని మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో వివిద గ్రామాల సర్పంచ్‌లతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలనిసూచించారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామంలోని సమస్యలు గుర్తించి తన దృష్టికి తీసుకవస్తే నిధులు కేటాయిస్తానని తెలిపారు. గ్రామపంచాయితీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

పేదల సొంతింటి కల సాకారం

నిరుపేద ప్రజల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేసిందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మండలంలోని సిరికొండ గ్రామంలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఇళ్ల కోసం నిరుపేదలు ఎదురు చూశారని, కాంగ్రెస్‌పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హమీ మేరకు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఇంటిని నిర్మించుకున్న కుటుంభాలకు అభినందనలు తెలిపారు. మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాల కార్యక్రమాలలో సర్పంచ్‌లు పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, ఎంపీడీఓ శశికళ, తహసీల్దార్‌ సురేష్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌ గొడుగు విఠల్‌, కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు బాలమల్లు, మాజీ ఎంపీపీలు రమణారెడ్డి, అయిలయ్య, నాయకులు పసుల వెంకటి, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, ప్రసాద్‌, బొల్లవేని రమేష్‌, నవీన్‌రెడ్డి, చంద్రారెడ్డి, నేరెళ్ల విజయ్‌, సంజీవ్‌, తీగల పుష్పలతలతో పాటు లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2026 | 12:39 AM