Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Nov 06 , 2026 | 12:47 AM

రైతుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్య క్రమాల అమలులో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి గా పనిచేయాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన సింగిల్‌ విండో పాలకవర్గాలపై ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కోనరావుపేట, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్య క్రమాల అమలులో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి గా పనిచేయాల్సిన బాధ్యత నూతనంగా ఎన్నికైన సింగిల్‌ విండో పాలకవర్గాలపై ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. కోనరావుపేట మండ లంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవా లు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనం తరం సింగిల్‌విండో పాలకవర్గం అభినందన సభలో పాల్గొ ని మాట్లాడారు. రాజకీయాల్లో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుం దని, పదవులు అనేవి ప్రజలకు సేవ చేసే అవకాశాల న్నారు. ఒక పదవికి పలువురు సమర్థులు పోటీలో ఉన్నప్ప టికీ పరిపాలనా సౌలభ్యం కోసం ఒకరికే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, బాధ్యతలు పొందినవారే గొప్పవారు, పొందని వారు తక్కువ అనే భావన ఎవరికీ ఉండకూడదని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందేలా చూడాలని, పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందు లు లేకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు జరిగేలా చైర్మన్‌, సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కోనరావుపేట ప్రాంతంలో 1500మంది విద్యా ర్థులు చదువుకునేలా తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్లు చేపూరి గంగాధర్‌, బొమ్మెన భాస్కర్‌ రావు, ఏఎంసీ చైర్మన్‌ కచ్చ కాయల ఎల్లయ్య, కాంగ్రెస్‌ జిల్లా నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్‌ రెడ్డి, ఫిరోజ్‌పాషా, బండ నర్సయ్య, నాలుక సత్యం, మండల అధ్యక్షుడు మానక సత్యంతో పాటు కాంగ్రెస్‌ నాయకులు సింగిల్‌ విండో డైరెక్ట ర్లు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 12:47 AM