రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:47 PM
రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
చొప్పదండి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా, రుణ మాఫీతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు తమ మొక్కజొన్నలను దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ కొత్తూరు మహేష్, వైస్ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరిత, కార్యదర్శి రాజేశ్వరి, ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, కళ్లెం తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.