రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:11 AM
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆన్నారు.
చందుర్తి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తు న్న విత్తనమేళా కార్యక్రమంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అం దించడం, భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగుపై అవగాహన కల్పించడం, ఆధునిక వ్యవసాయ పద్ధతు లను ప్రోత్సహించడమే విత్తనమేల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని రైతు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆన్నారు. ప్రజా ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీతో పాటు రైతు భరోసా, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలు, వివిధ రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రైతు లకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర తెలంగాణకే దక్కిందని ఆయన అన్నారు. రైతులు పండించిన సన్న రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని, సన్న రకాల వరి సాగు వైపు రైతులు ముందుకు రావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకానికి, రేషన్ కార్డు దారులకు పంపిణీ చేస్తోందని తెలిపారు. చందుర్తి మండల పరిధిలో సుమారు 12 వేల క్వింటాళ్ల విత్త నాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, రైతులు నాణ్యమైన విత్తనాలను మాత్రమే వినియోగించాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి, నేల స్వభావానికి అనుగుణంగా పంటల ఎంపిక, ఎరువుల వినియోగం, సాగు పద్ధతులపై రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. రైతు వేదికల ద్వారా ఏడు రకాల సన్న వరి వంగడాలు, చిరుధాన్యాలు, ఇతర పంటల సాగు విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు శాస్త్ర సాం కేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. ఒకే పంటపై ఆధారపడకుండా నేల ఆరోగ్యం, మార్కెట్ డిమాండ్, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత సీజన్‌లో సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అధికంగా కొనుగోలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పేరుతో ఇతర వ్యవసాయ సబ్సిడీలు, పనిముట్ల పంపిణీ తగ్గిపో యిందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులు ప్రభు త్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆధునిక, లాభ సాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చెలకల తిరుపతి, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, ఏడిఏ ప్రదీప్, తాసిల్దార్ భూపతి, సర్పంచ్ దూది మనిషా శ్రీనివాస్ రెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు, పంచాయతీ కార్యదర్శి కవిత, వివిధ గ్రామాల సర్పంచులు, ఏఈఓలు, ఆర్‌ఐ, విత్తనాల డీలర్లు, మార్కె ట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.