రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Nov 06 , 2026 | 12:46 AM
రైతుల సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అన్నారు. రైతులకు పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పించడంతో పాటు, ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వ పథ కాల ద్వారా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. గురువారం బోయినపల్లి మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. ముందుగా తడగొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. అనంతరం అనంతపల్లి గ్రామంలో ఏర్పా టుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు లు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిం చి మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ను పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా తూకం, గన్నీ బ్యాగులు, రవాణా తది త ర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారుల ను ఆదేశించారు. అనంతరం బోయినపల్లి రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో కల్యాణల క్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 112 మంది లబ్ధిదారులకు రూ.65.62 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబి డ్డల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్నామన్నారు. హామీలను నెరవేరుస్తూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచే యాలని సూచించారు. కార్యక్రమాల్లో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముందుగంటి సురేందర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు జోగినపల్లి వెంకటరామారావు, వన్నెల మమత రమణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ బో యిని ఎల్లేష్‌యాదవ్, వైస్‌చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, సర్పంచు లు ఏనుగుల కనకయ్య, కొలువుల లావణ్య నగే ష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్‌యాదవ్, నాయకులు నాగుల వంశీ, ఏమి రెడ్డి సురేందర్‌రెడ్డి, సంభ లక్ష్మీరాజం, తహసీ ల్దార్ షరీఫ్ మొయినుద్దీన్, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీధర్, ఏవో కే ప్రణీత తదితరులు పాల్గొన్నారు.