Share News

వైభవంగా గోదారంగ నాయకుల కల్యాణం

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:47 AM

జగిత్యాల పట్టణంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఇటీవల నిర్మించిన గోదా, లక్ష్మీదేవి, సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లోనలి 27 వ రోజేన ఆదివారం కూడారై ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

వైభవంగా గోదారంగ నాయకుల కల్యాణం
కోరుట్లలో పూజలు చేస్తున్న భక్తులు

జగిత్యాల అర్బన్‌: జగిత్యాల పట్టణంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఇటీవల నిర్మించిన గోదా, లక్ష్మీదేవి, సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లోనలి 27 వ రోజేన ఆదివారం కూడారై ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గోదా రంగనాయకుల కళ్యాణంను పురస్కరించుకుని భక్తులు రుడారై నోము నోచుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహ కులు భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు యాంసాని మహేష్‌ సుజాత దంపతులు, తవుటు రాంచంద్రం పాల్గొన్నారు.

ఫజగిత్యాల పట్టణంలోని విద్యానగర్‌ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం కూడారై ఉత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ ఆదివారం 27 వ రోజు తిరుప్పావై. షార్తు ముడై సేవా కాలం సుదర్శన యాగం 108 గంగాలాల్లో పాయసం నివేదన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ ఎస్‌ సురెందర్‌, వికాస తరంగిణి భక్తులు, ఆలయ ప్రధానార్చకులు రంజిత్‌ కుమార్‌ ఆచార్య లతపో పాటు ప్రముఖ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కుడారై ఉత్సవం

ఫకోరుట్ల: పట్టణంలోని అతిపురాతనమైన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కుడారై ఉత్సవం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు బీర్నంది నరసింహారావు ఆధ్వర్యంలో ఇత్తడి గంగాళంలో స్వామివారికి నైవేద్యం అందించారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ జువ్వాడి కృష్ణారావు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహిళలు భక్తిబావంతో భజనలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఎతిరాజం, ధర్మకర్తలు పాల్గొన్నారు.

ఫమెట్‌పల్లి రూరల్‌: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మండలంలోని జగ్గసాగర్‌ గ్రామంలోని సీతారామ ఆలయంలోని స్వామి వారికి కూడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆలయంలోని ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేకంగా అలంకరిచి, అర్చన తదితర కార్యక్రమాలను పురోహితులు జరిపారు. అనంతరం స్వామి వారికి 108 ఇత్తడి గంగాళాల్లో పాయసాన్ని గోదారంగనాథ స్వామికి నివేదించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపి తీర్థా ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 12:47 AM