Share News

ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియలో వేగం పెంచాలి

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:01 AM

ఓటరు ప్రోజెనీ మ్యాపింగ్‌ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ను ఆదేశించారు.

ఓటర్ల మ్యాపింగ్‌ ప్రక్రియలో వేగం పెంచాలి

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఓటరు ప్రోజెనీ మ్యాపింగ్‌ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఎస్‌ఐఅర్‌ ప్రక్రియకు సంబంధించి ఓటరు మ్యాపింగ్‌ నిర్వహణపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఓటరు ప్రోజెనీ మ్యాపింగ్‌లో మరింత వేగవంతం చేయాలని సూచించారు. 2002 వివరాలతో ప్రస్తుత వివరాలను సరిపోల్సి మ్యాపింగ్‌ ప్రక్రియను త్వరితగితన పూర్తి చేయాలని అదేశించారు. బూత్‌ స్థాయి అధికారులు తప్పనిసరిగా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రక్రియను అమలు చేయాలని రోజు వారీగా మ్యాపింగ్‌ వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ప్రోజెనీ మ్యాపింగ్‌ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. బూత్‌స్థాయి అధికారులు ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ఫామ్‌ 6, 6ఏ 7,8 పెండింగ్‌లో పెట్టవద్దని ఆదేశిం చారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ప్రోజెనీ మ్యాపింగ్‌ ప్రక్రియ ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు వేగంగ పూర్తి చేయాలని సూచించారు. బూత్‌ స్థాయి అధికా రులు క్షేత్రస్ధాయిలో పూర్తి చేయా లని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, వేములవాడ ఆర్డీవో కార్యాలయం డీఏవో ఉమారాణి, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు ప్రవీణ్‌, ఎన్నికల సెక్షన్‌ అధికారి రెహమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 01:01 AM