యూరియా యాప్‌ను రద్దు చేయాలి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:08 AM
యూరియా బస్తాల కోసం ప్రభుత్వం పెట్టిన యాప్ పని చేయడం లేదని, సిరిసిల్ల వేదిక నుంచి ఆ యాప్‌ను రద్దు చేయా లని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : యూరియా బస్తాల కోసం ప్రభుత్వం పెట్టిన యాప్ పని చేయడం లేదని, సిరిసిల్ల వేదిక నుంచి ఆ యాప్‌ను రద్దు చేయా లని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి కవిత రాగా పార్టీ నాయకులు, కార్యకర్త లు ఘనస్వాగతం పలికారు. జెండా పండగ కార్యక్రమం లో భాగంగా ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూ పానికి కవిత నివాళులర్పించి నేతన్న విగ్రహానిక పూల మాల వేశారు. అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్ర హానికి, ఫూలే దంపతుల విగ్రాహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం టీఆర్‌ఎస్ పార్టీ జెం డాను కవిత ఆవిష్కరించారు. అనంతరం సభలో కవిత మాట్లాడారు. తెలంగాణ వచ్చాక కూడా ప్రభుత్వ పాఠ శాలలో బడి ఉంటే పంతులుండరు, పంతులుంటే బడి సక్కగుండదు అన్ని ఉంటే గంటకొట్టేటోలుండరన్నారు. ఇట్లాంటి పరిస్థితులలో పిల్లలను సర్కార్ బడులకు పం పించలేక అప్పుసప్పు చేసి ప్రైవేటు పాఠశాలలకు పంపు తున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రభుత్వం ఆసుపత్రిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణ తెచ్చుకుంటిమి అన్ని పార్టీలు అధికారంలోకి వచ్చే ఎందుకు పేదసాదక గురించి ఆలోచన చేయడం లేదన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదోళ్ళకి ఇళ్లు రాలేవు ఉన్నోళ్లకే మళ్లీ ఇండ్లు వచ్చాయని ఆరోపిం చారు. ఎవరు అధికారంలోకి వస్తే బతుకులు మారుతా యే ప్రజలు ఆలోచన చేయాలని మీ గురించి తెలంగాణ రక్షణ సేన పార్టీని పెట్టామన్నారు. నేను ఒక పంతంతో వచ్చాను రాష్ట్రంలో ఏ ఒక్క పేదవారికి చదువుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కావద్దు, ఆసుపత్రికి వెల్తే మీ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కావాద్దని టీఆర్‌ఎస్ పార్టీ ఐదు పథకాలను పెట్టుకుందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్ పది సంవత్సరాల కాలంలో గ్రూప్స్‌కు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ రాలేదని కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగం ఇవ్వ లేదని ఆరోపించారు. మహిళ గ్రూప్‌ల మాదిరిగా తెలం గాణలో చదువుకున్న యువతి, యువకులకు గ్రూప్స్ పెట్టి వారికి దాదాపు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలను ఇచ్చే విధంగా టీఆర్‌ఎస్ ఆలోచన చేస్తుందన్నారు. సిరిసిల్ల సెస్‌ను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తే సెస్ మంగళహారితి అయి ప్రభుత్వం లో కలసిపోతుంటే కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరా మావు ఒక్క మాట కూడ మాట్లడలేదని అన్నారు. రైతు రాజు కావాలంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయాలో రైతుల కోసం ఒక కౌంటర్ ఉండాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కుట్రతో సపరేటుగా రైతులకు డిస్కాం పెడతా మని రైతులకు కరెంటు ఎత్తవేయాలని చూస్తే ఎమ్మెల్యే కేటీఆర్ రైతు డిస్కాం మీద మాట్లాడలేదని మండిపడ్డారు. రైతు డిస్కాం కావాలా వద్దా అన్నది కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సామాజిక న్యాయంకు తూట్లు పొడుస్తూ సిరిసిల్ల లో ఇసుక అక్రమ రవాణా చేసూ అక్ర మ సంపాదన కోసం నేరెళ్ల సంఘటన లో ఎనిమిది దళితులు, బీసీలను చిత్ర హింస పెట్టారని ఆరోపించారు. బాధితులను కేటీఆర్, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ వచ్చి పరామర్శించారు ఇప్పటికీ వారికి న్యాయం జరగలేదన్నారు. నేరెళ్ల బాధిత అన్నదమ్ములకు అండగా ఉంటా ఎలా ఉంటానన్నారు. వేములవాడ నియోజకవర్గంలో లక్ష 15వేల ఎకరాలకు నీళ్లు రావాలని కాని కేవలం 30వేల ఎకరాలకు మాత్రమే నీరు వస్తుందన్నారు. రైతన్నలకు నీరు వచ్చే విధంగా కూడా టీఆర్‌ఎస్ కొట్లాడుతుందన్నారు. అనంతరం పానీ పూరి తిని అస్వస్థకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కవిత, నాయకులు పరామ ర్శించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎండీ మజూద్, రాష్ట్ర పరిశీలకులు ధరణి, మారయ్య, సిరిసిల్ల ఇంచార్జీలు గుంటుక సంపత్, నియోజకవర్గం ఇంచార్జి బూస వేణు, వేములవాడ నియోజకవర్గం ఇన్ చార్జిలు సతీష్, సుధాకర్‌శర్మ, సిరిసిల్ల పట్టణ బాధ్యులు కుసుమ విష్ణుప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.