Share News

బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయం

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:54 PM

సమాజంలోని బడు గు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, నాగుల మల్లయ్య వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

బలహీనవర్గాల అభ్యున్నతే ధ్యేయం

సిరిసిల్ల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : సమాజంలోని బడు గు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, నాగుల మల్లయ్య వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం సిరిసిల్లలోని మాన్య ఫంక్షన్‌ హాల్‌లో బీసీ ఉద్యమ నాయకుడు మల్లయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం పురస్కారా ల ప్రదానోత్సవం నిర్వహించారు. గత 39 సంవత్సరాలు గా నాగుల మల్లయ్య వర్ధంతి సందర్భంగా జాతీయస్థా యిలో స్మారక పురస్కారాలను అందిస్తున్నారు, ఈ సంవ త్సరం ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన విక్రమ్‌- వన్‌ ఆర్బిటాల్‌ వాహక ప్రయోగంలో సిరిసిల్లకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు అడుప సంతోష్‌ కుమార్‌, అడుప కిరణ్‌, బొమ్మదేని నాగరాజులు భాగస్వామ్యులయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో నిలిచిన ఈ ముగ్గురికి నాగుల మల్లయ్య అవార్డులతో సత్క రించారు. ఇదే సందర్భంలో 170 నిమిషాల్లో అగ్గిపెట్టెల ఇమిడే చీరలు వేసి రికార్డు సృష్టించిన సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు హరిప్ర సాద్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన నాగుల మల్లయ్య ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. నాగుల మల్లయ్య బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల హక్కుల కోసం పోరాడిన నాయకుడని వారి ఆశ యాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. యువత ఇలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యను అభ్యసించి దేశ సేవలో ముందుం డాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి యువత దేశ అభివృద్ధిలో భాగ స్వాములై విక్రమ్‌-1వంటి అంతరిక్ష ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించ డం గర్వకారణమని అభినందించారు. ప్రపంచం గ్లోబల్‌ విలేజ్‌గా మారిందని, అంతరిక్ష సాంకేతికత దేశాభివృద్ధికి కీలకమైందని, జిల్లాకు చెందిన యువ ఇంజనీర్లు రాకెట్‌ నిర్మాణంలో భాగస్వాములు కావడం జిల్లాకు గర్వకారణమన్నారు.ఇలాంటి ప్రతిభావంతులను సన్మానించడం ద్వారా మరెందరో యువతకు స్ఫూర్తి కలుగుతుందని చెప్పారు.కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాల వల్ల పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారన్నారు. రుద్రంగిలో రూ.42 కోట్లతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ నిర్మాణ పనులను ప్రారం భించడం కూడా గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక విద్య అందిం చాలనే ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డు కమిటీ చైర్మన్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారా యణ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, అవార్డు కమిటీ కన్వీనర్లు నాగుల సంతోష్‌, ఎండీ సలీం, టౌన్‌ క్లబ్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఆడేపు చంద్రకళ, కౌన్సిలర్‌ బుర్ర నారాయణ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, మార్కె ట్‌ కమిటీ మాజీచైర్మన్‌ గడ్డం నర్సయ్య, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్య దర్శి ఆకునూరి బాలరాజు, గుగ్గిల జగన్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద విక్రమ్‌-1 ఆర్బిటాల్‌ వాహక ప్రయోగంలో కీలకపాత్ర వహించిన అడుప సంతోష్‌ కుమార్‌, అడుప కిరణ్‌, బొమ్మదేని నాగరాజులను శ్రీకృష్ణదేవరాయ హైస్కూల్‌, కాకతీయ హైస్కూల్‌, వికాస్‌ డిగ్రీ కాలేజీ పక్షాన సన్మానం చేశారు.

Updated Date - Aug 04 , 2026 | 11:54 PM