కరుణించని వానమ్మ
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:08 AM
అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తుంటే.. వానమ్మకు బ్రేక్ పడింది. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల విరామ దశ (మాన్‌సూన్ బ్రేక్) ప్రారంభమైంది. వర్షాకాలం మొదలైన తర్వాత కొన్ని రోజులపాటు హఠాత్తుగా వర్షాలు పడకుండా ఆగిపోవడాన్ని మాన్‌సూన్ బ్రేక్‌గా భావిస్తారు. రుతుపవనాల ద్రోణి హిమాలయాల వైపు కదిలినప్పుడు ఈ విరామం ఏర్పడి మినీ సమ్మర్‌గా మారుతుంది.
- పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
- జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
- చిరుజల్లులే తప్ప జాడ లేని భారీ వర్షం
- జిల్లాలో 11.55 మీటర్ల లోతుకు పడిపోయిన భూగర్భ జలాలు
- జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యం
- జిల్లాలో ముదురుతున్న నారుమడులు
- ఖరీఫ్ సాగుపై కరువు మేఘాలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తుంటే.. వానమ్మకు బ్రేక్ పడింది. తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల విరామ దశ (మాన్‌సూన్ బ్రేక్) ప్రారంభమైంది. వర్షాకాలం మొదలైన తర్వాత కొన్ని రోజులపాటు హఠాత్తుగా వర్షాలు పడకుండా ఆగిపోవడాన్ని మాన్‌సూన్ బ్రేక్‌గా భావిస్తారు. రుతుపవనాల ద్రోణి హిమాలయాల వైపు కదిలినప్పుడు ఈ విరామం ఏర్పడి మినీ సమ్మర్‌గా మారుతుంది. పగటి ఉష్ణోగ్రతలు 36 గరిష్ఠ డిగ్రీల వరకు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో తల్లడిల్లుతున్న రైతులకు ఎల్‌నినో ప్రభావానికి తోడు మాన్‌సూన్ బ్రేక్ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు దాటిపోయినా చిరుజల్లుల తప్ప భారీ వర్షం లేక జిల్లాలో సాగు పనులు మందకొడిగానే సాగుతున్నాయి. జిల్లాలో పత్తి సాగు మినహా వరి సాగు అంతగా ముందుకు కదలడం లేదు. వర్షాలు కురుస్తాయని భావించిన అన్నదాతలు పత్తి విత్తనాలు వేసుకొని ట్యాంకర్లతో నీటిని పోస్తూ విత్తనాలు మొలకెత్తేలా, మొలకెత్తిన మొక్కలను కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. నైరుతి వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు మరింత అడుగంటిపోతున్నాయి. జిల్లాలో 40 రోజుల్లో 186.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 139.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 25 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం ఉంది. జిల్లాలోని 13 మండలాల్లో రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్, బోయినపల్లి, సిరిసిల్ల, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్ళపల్లి ఇల్లంతకుంట, వేములవాడ, కోనరావుపేట, గంభీరావుపేట మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది. జిల్లాలో సరాసరి 11.55 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. వేములవాడ అర్బన్ మండలంలో 20.17 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. భారీ వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులు, కుంటలు చెరువులు వెలవెలబోతున్నాయి. ఆయకట్టుదారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
అన్నదాతల ఆశలకు బీటలు
ఖరీఫ్ సాగుపై అన్నదాతల ఆశలకు వర్షాభావ పరిస్థితులు బీటలు వేశాయి. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేసింది. ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగు అగమ్యగోచరంగా మారింది. తొలకరి జల్లులకే పత్తి సాగుకు విత్తనాలు వేసుకున్న రైతులు మొలకెత్తని విత్తనంతో నిరాశపడుతున్నారు. మరోవైపు వర్షాలు లేకపోవడంతో వరి సాగుపై రైతులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకవైపు నారు మడి ముదిరిపోతుంటే మరోవైపు నాట్లు వేయడానికి రైతులు సందిగ్ధంగానే ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం రైతులు పత్తి విత్తనాలు మాత్రం వేసుకున్నారు. జిల్లాలో ఈసారి 47120 ఎకరాల పత్తి సాగు అంచనాలో ఇప్పటివరకు 46 వేల 2590 ఎకరాలు సాగు చేసారు. జిల్లాలో మొక్కజొన్న 1350 ఎకరాలు, పెసర 10 ఎకరాలు, కందులు 180 ఎకరాల్లో వేశారు. జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన మేరకు ఖరీఫ్ సాగు కాలేదు కేవలం పత్తి సాగు మాత్రమే చివరి దశకు వచ్చింది.
జిల్లాలో 4 వేల ఎకరాల్లోనే వరి నాట్లు
జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి సాగు వైపే రైతులు మొగ్గు చూపుతారు. ఇందులో వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం పత్తి విత్తనాలు వేసుకోవడం పూర్తి అవుతుండగా వరి సాగు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో 2.48 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు లక్ష్యంలో వరి 1.91 లక్షల ఎకరాలకు అంచనా వేశారు. ఇందుకోసం రైతులు 1.80 లక్షల ఎకరాల సాగు కోసం నారుమడులు సిద్ధం చేసుకున్నారు. వర్షాలు సరిగ్గా పడకపోవడంతో వరి నాట్లు మందకొడిగా సాగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు కేవలం 4025 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి.
జూలై 10 వరకు జిల్లాలో వర్షపాతం (మిల్లీమీటర్లలో)
మండలం సాధారణం కురిసింది లోటు
రుద్రంగి 213.4 115.8 46.0
చందుర్తి 227.6 171.2 25.0
వేములవాడ రూరల్ 199.3 147.2 26.0
బోయినపల్లి 176.3 133.9 24.0
వేములవాడ 202.3 163.4 19.0
సిరిసిల్ల 195.9 122.2 38.0
కోనరావుపేట 172.6 167.8 3.0
వీర్నపల్లి 182.8 190.0 4.0(అధికం)
ఎల్లారెడ్డిపేట 177.9 125.9 29.0
గంభీరావుపేట 175.0 144.5 17.0
ముస్తాబాద్ 155.2 115.3 26.0
తంగళ్లపల్లి 200.7 118.5 41.0
ఇల్లంతకుంట 150.0 93.7 38.0
-----------------------------------------------------------------------------------------------------
సగటు వర్షపాతం 186.8 139.2 25.0
-----------------------------------------------------------------------------------------------------
జిల్లాలో మండలాల వారీగా భూగర్భ జలాలు (మీటర్ల లోతులో)
మండలం 2025 జూన్‌లో.. 2026 జూన్‌లో..
బోయినపల్లి 6.69 7.28
చందుర్తి 5.65 8.49
గంభీరావుపేట 11.85 12.76
ఇల్లంతకుంట 7.42 7.64
కోనరావుపేట 10.51 11.10
ముస్తాబాద్ 13.97 11.87
రుద్రంగి 6.57 10.12
సిరిసిల్ల 12.27 17.85
తంగళ్లపల్లి 9.71 11.36
వీర్నపల్లి 13.77 16.94
వేమువలాడ రూరల్ 6.06 7.96
వేములవాడ 18.52 20.17
ఎల్లారెడ్డిపేట 17.82 16.63
-----------------------------------------------------------------------------------------------------
సరాసరి 10.53 11.55
----------------------------------------------------------------------------------------------------
జిల్లాలో ఖరీఫ్ సాగు లక్ష్యం(ఎకరాల్లో)
మండలం వరి పత్తి ఇతర మొత్తం
గంభీరావుపేట 19,200 150 521 19,871
ఇల్లంతకుంట 23,800 12,800 1,638 38,238
ముస్తాబాద్ 25,000 650 1,229 26,879
సిరిసిల్ల 4,600 750 97 5,447
తంగళ్లపల్లి 21,600 1,300 1,152 24,052
వీర్నపల్లి 8,096 200 00 8,296
ఎల్లారెడ్డిపేట 18,600 3,300 14 21,914
బోయినపల్లి 13,000 7,000 1,260 21,260
చందుర్తి 15,600 5,500 412 21,512
కోనరావుపేట 19,200 4,400 587 24,187
రుద్రంగి 6,180 1,820 2,287 10,287
వేములవాడ 5,440 5,050 452 10,942
వేములవాడ రూరల్ 11,050 4,200 372 15,622
-----------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,91,366 47,120 10,021 2,48,507
-----------------------------------------------------------------------------------------------------