Share News

కేంద్ర విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:18 AM

బాధ్యతా రాహిత్యం తోనే నీట్‌ పరీక్ష లీకేజి జరిగిందని వెంటనే కేంద్ర విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలి

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : బాధ్యతా రాహిత్యం తోనే నీట్‌ పరీక్ష లీకేజి జరిగిందని వెంటనే కేంద్ర విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌ మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతుందని విద్యార్థులు వివిధ కార ణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో విద్యార్థులలో ఆత్మస్థై ర్యం దెబ్బతింటోందని, దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల గూర్చి, విద్యా వ్యవస్థల మార్పులు సం స్కరణలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థలోని లోపాలు సరిదిద్దవ చ్చునని రాహుల్‌గాంధీ సూచించారన్నారు. యువత భవిష్యత్తు రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టేలా దేశవ్యాప్తంగా ఒత్తిడి తీసుకురావాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారన్నారు. ఇటీవల జరిగిన నీట్‌ పరీక్ష విద్య వ్యవస్థలోని లోపాలను చూపించిందని ఆరోపించారు. నీట్‌ పరీక్ష రాయడానికి సుమారు 22లక్షల మంది విద్యార్థులు సిద్ధమై నారని. నీట్‌ పరీక్ష లీకేజీపై సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి భేషరుతుగా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 9న చలో డిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య, దత్తాత్రేయగౌడ్‌, పిల్ల కనయ్య, పులి రాంబా బు, జిల్లా అధికార ప్రతినిధి చిలుక రమేష్‌, జిల్లా ప్రధానకార్యదర్శులు వకులాభరణం శ్రీనివాస్‌, గొట్టె రుక్మిణి, రాగుల జగన్‌, మంగ కిరణ్‌, గిరిధర్‌రెడ్డి, బాల్‌లక్ష్మి, సామల రోజా, కామని వనిత, నాగుల విష్ణు, మిరియాలకార్‌ శ్రీనివాస్‌, ఫిరోజ్‌పాషా, అరుణ్‌చారి, వెంకట్‌రెడ్డి, చొక్కా ల రాము, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు రియాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 12:18 AM