కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:01 AM
నీట్ పరీక్ష పేపర్ లీకు లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యం లో గురువారం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు.
సిరిసిల్ల టౌన్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : నీట్ పరీక్ష పేపర్ లీకు లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ రిపబ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యం లో గురువారం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిప బ్లికన్ స్టూడెంట్స్ ఫెడరేషన్(ఆర్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు అంగూరి రంజిత్ మాట్లాడారు. దేశ రాజధాని జంతర్‌మంతర్ వద్ద నీట్ పరీక్ష లీక్‌లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఆందోళన చేపడుతుంటే బీజేపీ ప్రభుత్వం పోలీసు ల ద్వారా అమానుషంగా లాఠీచార్జ్ చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. శుక్రవారం జరిగే విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చే యాలన్నారు. ధర్నా చేస్తున్న ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకులను బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ అడ్డుకున్నారు.ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కార్యక్రమం లో ఆర్‌ఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.