Share News

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:40 AM

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మానేరు బిడ్జిపై జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.

కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మానేరు బిడ్జిపై జిల్లా యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో జిల్లా కేంద్రంకు వచ్చి పోయే వాహనాలు దాదాపు గంటకుపైగా స్థంబించిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్నా పోలీసులు రాస్తారోకోను విరమింపం జేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కౌడగాని వెంకటేష్‌ మాట్లాడుతూ నీట్‌ పరీక్ష లీకేజీ వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకారమన్నారు. దీనికి బాధ్య త వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. యువజన కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్షుడు చుక్కా రాజశేఖర్‌ మాట్లాడుతూ నీట్‌ పరీక్ష పత్రాల లీకేజీ జరగడం పట్ల కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడిందని, విద్యార్థులకు చేసిన మోసాన్ని ప్రజలు గమనించారని రానున్న రోజులలో బుద్ధి చెపు తారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దాదాపు 80కి పైగా వివిధ పరీక్ష పత్రాలు లీక్‌లు అయ్యాయని బీజేపీ ప్రభుత్వ చేతగాని తనానికి ఇది నిదర్శనం అని ఆరోపించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీ నామా చేయకుంటే దేశ రాజధాని డిల్లీలో యువజన కాంగ్రెస్‌ ఆధ్వ ర్యంలో నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యు వజన కాంగ్రెస్‌ వేములవాడ నియోజకవర్గం అధ్యక్షుడు న్యాత నవీన్‌, రాష్ట్ర అధికార ప్రతినిధులు రెడ్డిమల్ల భాను, గుడిసె ప్రభాకర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శులు, నాగం మురళి, శేఖర్‌, శైర్య నాయక్‌, ఎడ్ల తిరు పతి, సిరిసిల్ల పట్టణ అధ్యఓఉడు పోగుల దేవరాజురెడ్డి, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ఎగుర్ల ప్రశాంత్‌, గంభీరావుపేట మండల అధ్యక్షు డు గంగోల్ల స్వామి, నాయకులు ధర్మపురి శ్రీనివాస్‌, చుక్క రామస్వా మి, దండుగుల శేఖర్‌, నక్క సాయి, ఎండీ సోహెల్‌, నక్క నవీన్‌, శ్యాగ కుమార్‌, రాగుల చరణ్‌, షేక్‌ ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 12:40 AM