Share News

ఖజానా గలగల..

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:38 AM

గ్రామ పంచాయతీల ఖజానా గలగల.. కళకల్లాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామపంచాయతీలు సిబ్బంది పన్నుల వసూళ్లలో బిజీబిజీగా మారిపోయారు. ఆస్తి పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని గడువులోపే పూర్తిచేసి ఈసారి కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపే దిశగా పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఖజానా గలగల..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గ్రామ పంచాయతీల ఖజానా గలగల.. కళకల్లాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామపంచాయతీలు సిబ్బంది పన్నుల వసూళ్లలో బిజీబిజీగా మారిపోయారు. ఆస్తి పన్నుల వసూళ్లలో లక్ష్యాన్ని గడువులోపే పూర్తిచేసి ఈసారి కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపే దిశగా పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో వంద శాతం పన్నుల వసూలు పూర్తిచేసే దిశగా పంచాయతీ సిబ్బంది, అధికారులు లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు. మార్చి 31వ తేది గడువు లోపే పూర్తి స్థాయిలో పన్నుల వసూలు పూర్తిచేసే దిశగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 93 శాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రంలోనే రెండో స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కొనసాగుతోంది. మరో ఆరు రోజులు గడువు ఉండడంతో పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో పన్నుల వసూళ్లలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గడువు ముగిసే సమయానికి జిల్లాను మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంగా ఉన్నారు. గతంలో రాష్ట్రస్థాయిలో వరుసగా ముందంజలో ఉంటూ వస్తోంది. అదే లక్ష్యంతో ఈసారి కూడా ముందు వరుసలో ఉంది. జిల్లాలో గతంలో పంచాయతీలు కేంద్ర ప్రభుత్వ అందించే అనేక అవార్డులను గ్రామాలు అందుకున్నాయి. ఆదర్శంగా ముందుకు సాగుతున్న పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రావడంతో ఈసారి పన్నుల వసూలు కూడా సులభంగానే పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులు కూడా గ్రామపంచాయతీలకు వచ్చాయి. వాటికి తోడుగా పన్నుల వసూళ్లు డబ్బులు కూడా గ్రామ పాలనకు తోడ్పాటుగా నిలుస్తాయని పాలకవర్గాలు భావిస్తున్నాయి.

జిల్లాలో రూ.7.40 కోట్లు వసూలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల్లో 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లా పంచాయతీ అధికారుల నుంచి మొదలుకొని ఎంపీవోలు, కార్యదర్శుల వరకు పనుల వసూళ్లలో నిమగ్నం అయ్యారు. జిల్లాలో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో రూ 7 కోట్ల 93 లక్షల 22 వేల 706 పన్ను వసూలు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.7 కోట్ల 40 లక్షల 33వేల 169 పన్ను వసూలు చేశారు. మండలాల వారీగా చూస్తే బోయినపల్లి మండలంలో 23 గ్రామ పంచాయతీల్లో రూ.53,78,219కు రూ 51,76,422 వసూలు చేశారు. చందుర్తి మండలంలో 19 గ్రామపంచాయతీల్లో రూ.53,43,464కు వసూలు రూ.50,73,990, ఇల్లంతకుంట మండలంలో 35 గ్రామపంచాయతీల్లో రూ.59,40,086 కు వసూలు రూ.58,26,835, గంభీరావుపేట మండలంలో 22 గ్రామపంచాయతీల్లో రూ.84,48,413 కు వసూలు రూ.77,89,902, కోనరావుపేట మండలంలో 28 గ్రామపంచాయతీల్లో రూ.48,72,500 కు వసూలు రూ.47,52,273, ముస్తాబాద్‌ మండలంలో 22 గ్రామపంచాయతీల్లో రూ.1,17,90,219కు వసూలు రూ.1,05,23,281, రుద్రంగి మండలలో పది గ్రామపంచాయతీల్లో రూ.31,47,755కు వసూలు రూ.30,22,259, తంగళ్లపల్లి మండలంలో 30 గ్రామపంచాయతీల్లో రూ.97,60,848 కు వసూలు రూ.85,43,658, వీర్నపల్లి మండలంలో 17 గ్రామపంచాయతీల్లో రూ.19,58,562కు వసూలు రూ.19,09,449, వేములవాడ మండలంలో 11 గ్రామపంచాయతీల్లో రూ.76,29,537కు వసూలు రూ.67,45,010, వేములవాడ రూరల్‌ మండలంలో 17 గ్రామపంచాయతీల్లో రూ.28,65,406కు వసూలు రూ.27,39,282, ఎల్లారెడ్డిపేట మండలంలో 26 గ్రామపంచాయతీల్లో రూ.1,21,79,397కు రూ.1,19,30,808 పన్నులను వసూలు చేశారు. మిగిలిన వసూలుకు కసరత్తు చేస్తున్నారు.

పాత బకాయిలు రూ.7.84 లక్షలు వసూలు

జిల్లాలో పాత బకాయిల వసూళ్ల వైపు కూడా దృష్టి పెట్టారు. ఇప్పటివరకు పన్నుల వసూళ్లలో రూ.9లక్షల 91 వేల 840 పాత బకాయిలు ఉన్నాయి. ఇందులో రూ.7లక్షల 84 వేల 466 వసూలు చేశారు. మండలాల వారీగా చూస్తే బోయినపల్లి మండలంలో రూ.68,599కు రూ.50,524 వసూలు చేశారు. చందుర్తి మండలంలో రూ.8,301కు వసూలు రూ.8,301, ఇల్లంతకుంట మండలంలో రూ.83,524కు వసూలు రూ.73,708, గంభీరావుపేట మండలంలో రూ.4,97,539కు వసూలు రూ.4,95,791, కోనరావుపేట మండలంలో రూ.9,427కు వసూలు రూ.8,487, ముస్తాబాద్‌ మండలంలో రూ.3,635కు వసూలు రూ.2,865, రుద్రంగి మండలలో 10గ్రామపంచాయతీల్లో రూ.16,282కు వసూలు రూ.7,068, తంగళ్లపల్లి మండలంలో రూ.2,50,399 గాను వసూలు రూ 85,292, వీర్నపల్లి మండలంలో రూ.570కు వసూలు రూ.570, వేములవాడ మండలంలో రూ.13,937కు వసూలు రూ.12,917, వేములవాడ రూరల్‌ మండలంలో రూ.9,316కు వసూలు రూ.9,142, ఎల్లారెడ్డిపేట మండలంలో రూ30,311కు రూ.29,801 పన్నులను వసూలు చేశారు.

జిల్లాలో మండలాల వారీగా పన్నుల వసూలు

మండలం శాతం

బోయినపల్లి 96

చందుర్తి 95

ఇల్లంతకుంట 98

గంభీరావుపేట 92

కోనరావుపేట 98

ముస్తాబాద్‌ 89

రుద్రంగి 96

తంగళ్లపల్లి 88

వీర్నపల్లి 97

వేములవాడ 88

వేములవాడ రూరల్‌ 96

ఎల్లారెడ్డిపేట 98

Updated Date - Mar 25 , 2026 | 12:38 AM