గడువులోగా పట్టణ నక్షా సర్వే పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:02 AM
పట్టణంలోని చేపడుతున్న నక్షా సర్వేను గడువులోగా పూర్తి చే యాలని అధికారులకు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆదేశాలు జారీ చేశారు.
వేములవాడ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని చేపడుతున్న నక్షా సర్వేను గడువులోగా పూర్తి చే యాలని అధికారులకు మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ మం దిరంలో పట్టణ ప్రగతి పనులపై స మీక్ష నిర్వహించారు. పట్టణంలో సాగుతున్న నక్షా సర్వే పురోగతి, ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, పెన్షన్ ఐ-ఆప్షన్ అథెంటికేషన్, వన మహోత్సవం కార్యక్రమాలపై వార్డు అధికారు లతో చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నక్షా సర్వేలో భూములు, ఆస్తు ల వివరాల నమోదు అత్యంత ఖచ్చితత్వం, పారదర్శకత పాటించాలన్నారు. సాంకేతిక స మస్యలను అధిగమిస్తూ, ప్రభుత్వం నిర్ధేశించి న గడువులోగా సర్వేను వేగవంతం చేయాల ని మేనేజర్ సంపత్‌రెడ్డిని ఆదేశించారు. అలా గే నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి నిరు పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని, దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారు లకు ప్రభుత్వ నిధులు సకాలంలో చేరేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్ లోకేష్, మేనేజర్ సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.