టార్గెట్‌ను సకాలంలో పూర్తి చేయాలి
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:47 PM
నిర్దేశించిన టార్గెట్‌ను సకాలం లో పూర్తిచేయాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు.
కోనరావుపేట, జనవరి 2 (ఆంధ్రజ్యోతి) : నిర్దేశించిన టార్గెట్‌ను సకాలం లో పూర్తిచేయాలని జిల్లా వైద్యాధికారి రజిత కోరారు. కోనరావుపేట ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాన్ని, కొలనూరు ఉపకేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఆరోగ్య కేంద్ర వైద్య బృందానికి ఇచ్చి న టార్గెట్లను పూర్తిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారి వేణు మాధవ్, సీహెచ్‌వో బాలచంద్రం, వైద్య సిబ్బంది ఉన్నారు.