Share News

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని సాధించాలి

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:13 AM

జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణ లక్ష్యం చేరుకోవాలని సంబంధిత అధికారులు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని సాధించాలి

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 24 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణ లక్ష్యం చేరుకోవాలని సంబంధిత అధికారులు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ లో గురువారం క్రాప్‌ బుకింగ్‌, ఎరువుల సర ఫరా, ఆయిల్‌పామ్‌ సాగు, ప్రత్యామ్నాయ పంట ల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, సింగిల్‌ విండో కార్యదర్శులు, అసిస్టెంట్‌ రిజిస్ట్రా ర్లు, మార్క్‌ఫెడ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు క్రాప్‌ బుకింగ్‌ 56 శాతం పూర్తి అయిందని, మిగతా బుకింగ్‌ను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారు లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ లక్ష్యాన్ని సాధించాలన్నారు.

23 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరఫరా

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ అంచనాల మేరకు మొత్తం వేల 21వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని కలెక్టర్‌ వెల్లడిం చారు. ఇప్పటివరకు 23 వేల మెట్రిక్‌ టన్నులు విక్రయాలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఇంకా రెండు వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిలువ ఉన్నాయని, జిల్లాలో ఎరువులకు కొరత లేదని స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆయిల్‌పామ్‌తో వచ్చే లాభాలు, ప్రభుత్వ సబ్సిడీలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఆయిల్‌పామ్‌ సాగు వైపు ప్రోత్సహించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు. ఆయిల్‌పామ్‌ మద్దతు ధర, దిగుబడి రైతులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండాలని ఉద్యాన, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్‌.శరత్‌ బాబు, జిల్లా వ్యవసా య అధికారిణి అఫ్జల్‌ బేగం, సహకార శాఖ అధికారి రామకృష్ణ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళిక ప్రకారం పంటల కొనుగోలు

ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ రకాల పంటల కొనుగోళ్లు పకడ్బందీ ప్రణాళికల ప్రకారం ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్‌ అదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఖరీఫ్‌ సీజన్‌ 2026-27 కొనుగోళ్లు కోసం చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు దాదాపు 2లక్షల 40వేల మెట్రిక్‌ టన్నుల సన్న, దోడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. జిల్లాలో అక్టోబరు చివరి వారం ఽనుంచి ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారని అన్నారు. ఈ సమావే శంలో డీసీఎస్‌వో బుచ్చిబాబు, డీఎం గోపాల్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అఫ్జల్‌బేగం, జిల్లా మార్కెటింగ్‌ అధికా రి ప్రకాష్‌, అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి

ఇందరిమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. కలె క్టరేట్‌లో గురువారం రాత్రి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణాలు, చేయూత పెన్షన్‌ల దరఖాస్తుల పరిశీలనపై డీఆర్‌డీవో, హౌసింగ్‌ అధికారులు, ఎంపీడీవో లు, ఏఈలతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6339 ఇందిరమ్మ ఇళ్లు ముగ్గు పోశామని, 5294 ఇళ్లు బెస్‌మెంట్‌ లెవెల్లో ఉన్నాయని, 4756 ఇళ్లు గోడల వరకు వచ్చాయని, 4467 స్లాబ్‌ లెవల్‌కు వచ్చాయని, 9832 ఇళ్లు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. ముగ్గు పోసిన వారికి ఇళ్లు నిర్మాణ పనులు మొదలు పెట్టించాలని, బెస్మెంట్‌ వరకు పూర్తి చేసిన వారిని గోడల వరకు అక్కడి నుంచి స్లాబ్‌ లెవెల్‌కు తుది దశ పనులు పూర్తి చేసేలా, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్‌ అదేశించారు. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేయూత పెన్షన్‌ అందేలా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటమఽధవ రావు, డీఆర్‌డీవో లక్ష్మీనారాయణ, మైనింగ్‌ ఏడీ క్రాంతికు మార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:13 AM