Share News

విద్యార్థికి సులభంగా భాష అర్థం కావాలి

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:43 PM

తరగతి గదిలోని ప్రతి విద్యార్థికి సులభంగా అర్థం అయ్యేలా ఉపాధ్యాయులు భాషను బోధించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు.

విద్యార్థికి సులభంగా భాష అర్థం కావాలి

సిరిసిల్ల, జూలై 14 (ఆంధ్రజ్యోతి) : తరగతి గదిలోని ప్రతి విద్యార్థికి సులభంగా అర్థం అయ్యేలా ఉపాధ్యాయులు భాషను బోధించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వెంకంపే ట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఇన్‌ సర్వీస్‌ టీచర్‌ ట్రైనింగ్‌లో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ హిందీ శిక్ష ణ ఇస్తుండగా ఉపాధ్యాయులతో కలిసి కూర్చుని కలెక్టర్‌ అంశాలను విన్నారు. ప్రతిసారి బోధించే ఉపాధ్యాయులు విద్యార్థుల స్థానంలో కూ ర్చుని పాఠాలు వినడం, వారి అనుభవాలను, శిక్షణ ప్రక్రియపై కలెక్టర్‌ అడిగితెలుసుకున్నారు. అలాగే ఫిజికల్‌ సైర్స్‌ ఉపాధ్యాయులకు సిరిసిల్ల లోని గీతానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఇంగ్లీష్‌ ఉపాధ్యాయు లకు వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమికస్థాయి ఎంఆర్‌ పీలకు తెలుగు, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ అంశాల్లో ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శిక్షణ కొనసాగుతున్నది. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు అందించే ఇన్‌ సర్వీస్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశం రోజువారి బోధనలో ఉపయోగించాల ని సూచించారు. విద్యార్థి కేంద్రీకృత, వివిధ రంగులు ఉపయోగిస్తూ, కృ త్యదార బోధన చేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ పదాలు సులభంగా నేర్చుకునేలా బోధించాలని ఆదేశించారు. రోజువారి జీవితంలో భాగంగా వినియోగించే పదాలు, అంకెలు, పండ్లు, ఇతర విషయాలు సులభంగా నేర్చుకునేలా బోధించాలని తెలిపారు. బోధనలో టీఎల్‌ఎంలు వినియోగించి, విద్యార్థులు ఆసక్తితో బడికి వచ్చే లా వివరించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ ఇతర అంశాల్లో కనీస అభ్యాసన సామర్ధ్యాలు మెరుగు అయ్యేలా తీర్చిదిద్దాల ని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులందరూ శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో అమలు చేయాలని, మంచి ఫలితాలు వచ్చే లా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, తహసీల్దార్‌ మహేష్‌, విద్యాశాఖఅధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 11:43 PM