రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి
ABN , Publish Date - May 02 , 2026 | 12:35 AM
రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 19వ వార్డు శంకులపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు.
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల టౌన, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 19వ వార్డు శంకులపల్లిలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నియోజకవర్గంలో 100కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడవి చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించడంలో చొరవ చూపాలని, ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావలని సూచించారు. దేశంలో, రాష్ట్రంలో పెట్రోలు, డీజీల్ కొరత వల్ల లారీల్లో ధాన్యం తరలించడంలో కొంత జాప్యం జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన సమిండ్ల వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, కౌన్సిలర్లు ఏనుగుల లావణ్య రాజు, కూతురు శేఖర్, మాజీ ఏఎంసీ చైర్మనలు కొలుగురి దామోదర్ రావు, నక్కల రాధా రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు తోట మల్లికార్జున, కూసరి అనిల్, జిల్లా యూత అధ్యక్షుడు బీరం రాజేష్, నాయకులు బాల ముకుందం, రవీందర్ రావు, రాజు, సాగర్, గంగాధర్, మెప్మా ఏఓ శ్రీనివాస్, టియంసీ రజిత, లావణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలగించొద్దు
మల్లాపూర్: ధాన్యం విక్రయించడానికి కేంద్రాలకు వచ్చిన రైతులకు నిర్వహకులు ఇబ్బందులు కలిగించవద్దని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సూచించారు. శుక్రవారం మండలంలోని రాఘవుపేట లో సర్పంచ శ్రీనివాస్‌తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలగకుండా సెర్ప్ అధికారులకు మహిళలకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. కేంద్రంలో వసతులు కల్పించాలన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న మద్ధతు ధర పొందాలని అన్నదాతలకు సూచించారు. కార్యక్రమంలో సెర్ప్ అధికారులు, సిబ్బంది, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.