బీఆర్‌ఎస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం
ABN , Publish Date - Sep 01 , 2026 | 01:05 AM
గత బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రూరల్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యో తి) : గత బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. నూతనంగా నియామకమైన వేముల వాడ రూరల్, అర్బన్ మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూ ర్వకంగా కలవగా వారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్‌మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. బీఆర్ ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై అసత్యాలను ప్రచా రం చేయడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ప్రతిపక్షాల దుష్ప్రచారాలను వాస్తవాలతో తిప్ప కొట్టేందుకు సోషల్‌మీడియా వేదికగా ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ రొండి రాజు, రూరల్ మండల అధ్యక్షుడు సోయినేని కరుణాకర్, అర్బన్ మండ ల అధ్యక్షుడు వంగ పర్శరాం, పలువురు సర్పం చులు, నూతన కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.