Share News

మోగిన నగారా..

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:52 AM

మున్సిపల్‌ ఎన్నికలకు నగరా మోగింది. మున్సిపల్‌ చైర్మన్‌, వార్డు కౌన్సిలర్ల ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదుని మంగళవారం ప్రకటించింది.

మోగిన నగారా..

జగిత్యాల, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలకు నగరా మోగింది. మున్సిపల్‌ చైర్మన్‌, వార్డు కౌన్సిలర్ల ఎన్నికలకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదుని మంగళవారం ప్రకటించింది. జిల్లాలో మొత్తం ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 136 వార్డు కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జగిత్యాల మున్సిపల్‌లో 50 వార్డులు, రాయికల్‌లో 12 వార్డులు, ధర్మపురిలో 15 వార్డులు, కోరుట్లలో 33 వార్డులు, మెట్‌పల్లిలో 26 వార్డు కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఫషెడ్యూల్‌ ఇలా..

ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జనవరి 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 1వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు అప్పీళ్ల స్వీకరణ, ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్పీళ్లను పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌, ఫిబ్రవరి 12వ తేదీన అవసరమైన పక్షంలో రీ పోలింగ్‌ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరగనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ జారీ చేశారు.

ఫజిల్లాలో 2,31,627 మంది ఓటర్లు...

జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 2,31,627 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 1,11,805, స్త్రీలు 1,19,797, ఇతరులు 25 మంది ఉన్నారు. కాగా ధర్మపురి మున్సిపాలిటీలో 6,722 మంది పురుషులు, 7,310 మంది స్త్రీలు, 3 ఇతరులున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో 46,039 మంది పురుషులు, 48,742 మంది స్త్రీలు, 19 ఇతరులున్నారు. రాయికల్‌ మున్సిపాలిటీలో 6,157 మంది పురుషులు, 6,927 మంది స్త్రీలున్నారు. కోరుట్ల మున్సిపాలిటీలో 30,604 మంది పురుషులు, 32,901 మంది స్త్రీలు, 2 ఇతరులున్నారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో 22,283 మంది పురుషులు, 23,917 మంది స్త్రీలు, 1 ఇతరులున్నారు.

ఫ 641 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం..

ఐదు మున్సిపాలిటీల్లో 641 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. ఇందులో 453 జంబో బాక్సులు, 188 మంది బిగ్‌ సైజ్‌ బాక్సులున్నాయి. కాగా మెట్‌పల్లిలో 118 బ్యాలెట్‌ బాక్సులకు గాను 88 జంబో, 30 బిగ్‌ సైజ్‌, ధర్మపురిలో 50 బ్యాలెట్‌ బాక్సులకు గాను 35 జంబో, 15 బిగ్‌ సైజ్‌, రాయికల్‌లో 44 బ్యాలెట్‌ బాక్సులకు గాను 30 జంబో, 14 బిగ్‌ సైజ్‌, జగిత్యాలలో 258 బ్యాలెట్‌ బాక్సులకు గాను 179 జంబో, 79 బిగ్‌ సైజ్‌, కోరుట్లలో 171 బ్యాలెట్‌ బాక్సులకు గాను 121 జంబో, 50 బిగ్‌ సైజ్‌ బాక్సులను సిద్ధంగా ఉంచారు.

ఫ 58 మంది ఆర్‌ఓలు

మున్సిపాలిటీల్లో 58 మంది రిటర్నింగ్‌ ఆఫీసర్లు (ఆర్‌ఓ), 56 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్స్‌ (ఏఆర్‌ఓ), 50 మంది జోనల్‌ ఆఫీసర్లు, 6 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, 5 స్టాటిక్‌ సర్వేలైన్స్‌ టీం (ఎస్‌ఎస్‌టీఎస్‌)లను నియామకం చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,821 పోలింగ్‌ సిబ్బందిని నియామకం చేశారు. ఇందులో 379 ప్రిసిడింగ్‌ ఆఫీసర్లు (పీఓ)కు గానూ 20 శాతం అదనంగా 455 మంది పీఓలను నియామకం చేశారు. 1,81 మంది ఓపీఓలను నియమించారు. కాగా మెట్‌పల్లిలో 90 మంది పీఓలు, 360 మంది ఓపీఓలు, ధర్మపురిలో 35 మంది పీఓలు, 140 మంది ఓపీఓలు, రాయికల్‌లో 29 మంది పీఓలు, 115 మంది ఓపీఓలు, జగిత్యాలలో 179 మంది పీఓలు, 716 మంది ఓపీఓలు, కోరుట్లలో 122 మంది పీఓలు, 490 మంది ఓపీఓలను నియమించారు.

ఫఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు ముగ్గురు పోలిస్‌ పర్సన్‌లు..

జిల్లాలో ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు ముగ్గురు పోలీస్‌ పర్సన్‌ల చొప్పున 379 కేంద్రాలకు, 1,137 మంది పోలీస్‌ పర్సన్‌లు అవసరమని అంచనా వేశారు. ఇందులో మెట్‌పల్లిలో 225 మంది, ధర్మపురిలో 87 మంది. రాయికల్‌లో 72 మంది, జగిత్యాలలో 447 మంది, కోరుట్లలో 306 మంది పోలీసు పర్సన్‌లు అవసరమని అంచనా వేశారు.

ఫ46 నామినేషన్‌ కేంద్రాలు..

జగిత్యాలలో మున్సిపల్‌ కార్యాలయం, మెప్మా భవనంలో 17 నామినేషన్‌ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని, రిసిప్షన్‌ కేంద్రాన్ని, కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పరిచారు. రాయికల్‌ మున్సిపల్‌ కార్యాలయంలో 4 నామినేషన్‌ కేంరద్రాలు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌, రిసిప్షన్‌ కేంద్రాలు, జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పరిచారు. ధర్మపురి మున్సిపల్‌ కార్యాలయంలో 5 నామినేషన్‌ కేంద్రాలు, ప్రభుత్వ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్‌, రిసిప్షన్‌ కేంద్రాలు, జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పరిచారు. కోరుట్ల మున్సిపల్‌ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, సినారే భవనంలో 11 నామినేషన్‌ కేంద్రాలు, ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌, రిసిప్షన్‌ కేంద్రాలు, జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పరిచారు. మెట్‌పల్లి మెప్మా కార్యాలయంలో 9 నామినేషన్‌ కేంద్రాలు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ పంక్షన్‌ హాలులో డిస్ట్రిబ్యూషన్‌, రిసిప్షన్‌ కేంద్రాలు, జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పరిచారు.

ఫ 379 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు..

జిల్లాలోని మున్సిపాలిటీల్లో 123 లొకేషన్లలో 379 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాలలో 49 లొకేషన్లలో 149 కేంద్రాలు, రాయికల్‌లో 6 లొకేషన్లలో 24 కేంద్రాలు, ధర్మపురిలో 12 లొకేషన్లలో 29 కేంద్రాలు, కోరుట్లలో 27 లొకేషన్లలో 102 కేంద్రాలు, మెట్‌పల్లిలో 29 లొకేషన్లలో 75 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కాగా జిల్లాలో ఒకే లొకేషన్‌లో ఒక పోలింగ్‌ పోలింగ్‌ స్టేషన్‌లు 10 ప్రాంతాల్లో, 21 ప్రాంతాల్లో రెండు పోలింగ్‌ కేంద్రాల చొప్పున, 73 ప్రాంతాల్లో మూడు పోలింగ్‌ కేంద్రాల చొప్పున, 5 ప్రాంతాల్లో నాలుగు పోలింగ్‌ కేంద్రాల చొప్పున, ఒక ప్రాంతంలో 5 పోలింగ్‌ కేంద్రాలు, 11 ప్రాంతాల్లో ప్రాంతాల్లో 6 పోలింగ్‌ కేంద్రాల చొప్పున, ఒక ప్రాంతంలో 7 పోలింగ్‌ కేంద్రాలు, ఒక ప్రాంతంలో 10 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. కాగా జిల్లాలో 30 సమస్యాత్మకం పోలింగ్‌ కేంద్రాలు, 20 అతి సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించారు. ఇందులో ధర్మపురిలో 2 సమస్యాత్మకం, 1 అతి సమస్యాత్మకం, రాయికల్‌ 2 సమస్యాత్మకం, 4 అతి సమస్యాత్మకం, జగిత్యాలలో 22 సమస్యాత్మకం, 14 అతి సమస్యాత్మకం, కోరుట్లలో 4 సమస్యాత్మకం, 1 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు.

ఫఅమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి

రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికార బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్‌కు సంబంధించిన ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా పరిష్కరించడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

Updated Date - Jan 28 , 2026 | 12:52 AM