Share News

ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా పూర్తి చేయాలి

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:40 AM

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఅర్‌) లక్ష్యం పకడ్బందీగా పూర్తిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ పవన్‌కుమార్‌శర్మ ఆదే శించారు.

ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా పూర్తి చేయాలి

సిరిసిల్ల అర్బన్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఅర్‌) లక్ష్యం పకడ్బందీగా పూర్తిచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ పవన్‌కుమార్‌శర్మ ఆదే శించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న ప్రక్రియపై ఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ పవన్‌కుమార్‌శర్మ కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీ క్షించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఅర్‌ ప్రక్రియ పురోగతి ఫారాల పంపిణీ డిజిటలైజేషన్‌పై అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎస్‌ఐఅర్‌ ప్రక్రి య ఫారాల పంపీణీ డిజిటలైజేషన్‌లో వేగం పెంచాలని సూచిం చారు. ఉత్తమ ప్రతిభ చూపి ఫారాల పంపిణీ డిజిటలైజేషన్‌ ప్రక్రి య వేగవంతం చేస్తున్న విఽధానాలను అడిగితెలుసుకున్నారు. కలెక్ట ర్‌ బీఎల్‌వోలతో మాట్లాడి ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని ఆదే శించారు. పనితీరులో వెనుకబడిన బీఎల్‌వోలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టా లని వారికి సహాయకులను నియమించి ప్రక్రియను పూర్తి చేయా లని సూచించారు.గడువులోగా డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలన్నారు.

బీఎల్‌వోలకు లక్ష్యం నిర్ణయించాలి

ఎస్‌ఐఅర్‌లో భాగంగా ప్రతి బూత్‌ లెవల్‌ అధికారుకుల లక్ష్యం నిర్ణయించి ముందకు వెళ్లేలా అదేఽశాలు ఇవ్వాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు. మున్సిపాల్టీ పరిధిలోని గ్రామాల్లో కూడా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని అదేశించారు. ఓటర్ల ఫారాలు నింపడంలో సహాయం అందించాలని వివరాలు పక్కాగా నింపాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నిఖిత, ఏఈఅర్‌వోలు మహేష్‌, జయంత్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:40 AM