జనసంద్రమైన బద్ది పోచమ్మ సన్నిధి
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:37 AM
శక్తి స్వరూపిణి, కోర్కెలుతీర్చే కల్పవ ల్లి వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం జనసంద్రమైంది.
వేములవాడ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): శక్తి స్వరూపిణి, కోర్కెలుతీర్చే కల్పవ ల్లి వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం జనసంద్రమైంది. రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన బద్ది పోచమ్మ అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవా రం రోజున భక్తులు వేలాదిగా పోటెత్తడంతో పరిసరాలన్నీ జాతరను తలపించా యి. తెల్లవారు జామున అమ్మవారికి నైవేద్యాన్ని వండుకుని, పసుపు కుంకుమల తో బోనాలను అందంగా అలంకరించుకుని డప్పుచప్పుళ్లు, బైండ్లోళ్ల పాటలు, శివ సత్తుల నృత్యాలతో భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. నెత్తిన బోనంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించారు. ఆలయంలోకి ప్రవే శించి అమ్మవారికి పట్నాలు వేసి, పట్టు వస్ర్తాలను, నైవేద్యాన్ని సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని పిల్లపాపలతో చల్లగా చూడాలని మొక్కులు చెల్లించు కున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి నేతృ త్వంలో ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.