మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Nov 12 , 2026 | 12:24 AM
దేశ తొలి విద్యాశాఖమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
కరీంనగర్ టౌన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశ తొలి విద్యాశాఖమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవం, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, మైనార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుత దేశంలో విద్యావ్యాప్తికి బలమైన పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్‌కలాం ఆజాద్ అని కొనియాడారు. విద్యా అభివృద్ధికి, లౌకిక వాదానికి, జాతీయ సమైక్యతకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇటీవల పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరీ, డీఆర్‌వో స్వామి, మైనార్టీ సంక్షేమ అధికారి జలాలుద్దీన్ అక్బర్, డీఈవో తిరుపతిరావు, బీసీ సంక్షేమశాఖ అధికారి అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు.