Share News

కదం తొక్కిన కాషాయ సైన్యం

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:02 AM

బీజేపీ మహా పాదయాత్ర కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కార్యకర్తల్లో ఒక్కసారిగా జోరు పెరిగింది. ’ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో ఎస్‌ఐఆర్‌కు అనుకూలంగా బీజేపీ నిర్వహించిన మహాపాదయాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ అయింది.

కదం తొక్కిన కాషాయ సైన్యం

- బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నింపిన పాదయాత్ర

- అంచనాలకు మించి జనసందోహం

కరీంనగర్‌/ కరీంనగర్‌టౌన, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): బీజేపీ మహా పాదయాత్ర కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాషాయ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. కార్యకర్తల్లో ఒక్కసారిగా జోరు పెరిగింది. ’ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో ఎస్‌ఐఆర్‌కు అనుకూలంగా బీజేపీ నిర్వహించిన మహాపాదయాత్ర గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. కరీంనగర్‌లోని ప్రధాన రహదారులు, వీధులు ఎటు చూసినా కాషాయజెండాల రెపరెపలతో కళకళలాడాయి. అడుగడుగునా జనసందోహం.. డప్పు దరువులు, జై శ్రీరాం.. భారత మాతాకీ జై అనే నినాదాలతో కరీంనగర్‌ మార్మోగింది. దండులా కదిలిన కమలదండు పాదయాత్రతో కదం తొక్కింది. నగరంలోని వైశ్య భవననుంచి కమాన వరకు కవాతులా సాగిన పాదయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. నృత్యాలతో మహిళా నాయకులు సందడి చేశారు. ప్రతిపక్షాల వైఖరిని ఎండగడుతూ పలురకాల నినాదాలతో హోరెత్తించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కమలనాథులతో కరీంనగర్‌ వీధులన్నీ జనసందోహంతో కిక్కిరిశాయి. ఎటు చూసినా కాషాయమయమనే విధంగా నగరమంతా కళకళలాడింది.

ఫ మీ ఉత్సాహాన్ని చూడాలనే కరీంనగర్‌కువచ్చాను

- బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన నబీన

కరీంనగర్‌లో మీ ఉత్సాహాన్ని కళ్లారా చూడాలనే కరీంనగర్‌కు వచ్చానని భారతీయ జనతాపార్టీ జాతీయఅధ్యక్షుడు నితిన నబీన అన్నారు. వైశ్య భవన వద్ద ర్యాలీని ప్రారంభిచడానికి ముందు ఆయన ప్రసంగించారు. ఈ మహా పాదయాత్రకు ప్రజలు ప్రభంజనంలా తరలివచ్చి మాతో నిలబడడం సంతోషం కలిగిస్తుందన్నారు. కరీంనగర్‌లోని ప్రతి ఒక్కరికీ, భారీ సంఖ్యలో తరలివచ్చిన నా తల్లులకు, ఉత్సాహంతో నిలబడిన నా యువ మిత్రులకు నా హృదయపూర్వక ప్రణామాలని చేతులు జోడించి నమస్కరించారు. ప్రజాస్వామ్య గొంతుకను మీతో కలిసి బలంగా వినిపించడానికే కరీంనగర్‌కు వచ్చానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో చొరబాటుదారులకు ఓటు కల్పించబోమని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీతోపాటు కాంగ్రెస్‌ నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ఇక్కడికి వచ్చానన్నారు. బండి సంజయ్‌పై ఇక్కడి శ్రేణుల్లో ఉన్న అభిమానం తనకు అర్థమవుతుందన్నారు. మోదీ నేతృత్వంలో వికసిత భారత సాకారమవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చి ఇక్కడి యువత ఆశలు నెరవేస్తుందని హామీ ఇచ్చారు.

ఫ బండి సంజయ్‌కి ప్రశంసలు

కరీంనగర్‌లో పాదయాత్ర సక్సెస్‌ అయిన తీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన నబీన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ను ప్రశంసించారు. యాత్ర ముగించుకుని వెళ్లే సమయంలో హెలీప్యాడ్‌ వద్ద.. ’గ్రేట్‌ యాత్ర.. గ్రాండ్‌ సక్సెస్‌’ అంటూ నితిన నబీన బండి సంజయ్‌ను ఆలింగనం చేసుకున్నారు. గతంలో పలుమార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమం షెడ్యూల్‌ మూడు రోజుల కిందటే ఖరారైనప్పటికీ పెద్ద సంఖ్యలో జనం రావడంపై పార్టీ జాతీయ అఽధ్యక్షుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. పాదయాత్రకు ముందు వేదిక వద్ద నితిన నబీన బండి సంజయ్‌తోపాటు కరీంనగర్‌ జనాలు కనిపించే విధంగా ఆయన సెల్‌ఫోనతో సెల్ఫీ తీసుకున్నారు.

ఫ కరీంనగర్‌.. కాషాయ అడ్డా..

- బండి సంజయ్‌కుమార్‌, కేంద్రమంత్రి

పోరాటాల చరిత్ర గల కరీంనగర్‌ గడ్డ.. ఈ పాదయాత్రతో కాషాయ అడ్డాగా మరోసారి నిరూపితమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఇంత పెద్ద జనసందోహాన్ని చూస్తే తన మనస్సు పులకరిస్తోందన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయ జెండా కోసం ఎక్కడి దాకైనా కొట్లాడుతానన్నారు. ఎస్‌ఐఆర్‌ విషయంలో ప్రతిపక్షాలు అనవరసమైన రాద్ధాంతాలు చేస్తున్నాయన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుతోపాటు కరీంనగర్‌కు చెందిన ఎమ్మెస్సార్‌ చనిపోయినా వారి ఓట్లను జాబితా నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రారంభించే వరకు తొలగించలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాము పాదయాత్ర చేపడుతున్నామన్నారు.

సైడ్‌లైట్స్‌...

- మోదీ మాస్క్‌లను ధరించిన పలువురు ప్రత్యేకాకర్షణగా నిలిచారు.

- జానపద కళాకారుల ఆటాపాటలు కార్యకర్తల్లో హుషారు నింపాయి.

- మహిళలు కాషాయకండువాలను గాల్లోకి తిప్పుతూ నృత్యాలు చేశారు.

- ఎస్‌ఐఆర్‌కు మద్దతుగా పలువురు పట్టుకున్న ప్లకార్డు ఆకర్షణగా నిలిచాయి.

- మధ్యాహ్నం 2.30కి ఆర్యవైశ్యా భవన వద్దకు నితిన నబీన చేరుకున్నారు.

- 20 నిమిషాల పాటు తన ప్రసంగాన్ని నితిననబీన కొనసాగించారు.

- బండి సంజయ్‌ పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా కేరింతల హోరు వినపడింది.

- సాయంత్రం 4.30 గంటలకు హెలీక్యాప్టర్‌లో నితిననబీన హైదారాబాద్‌ బయలుదేరారు.

- యాత్ర పొడుగునా నాయకులపై భవనాలపై నుంచి పూలవర్షాన్ని కురిపించారు.

- 45 నిమిషాలపాటు దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉత్సాహంగా సాగింది.

- పోలీసులు యాత్రలో నాయకులను, కార్యకర్తలను కట్టడి చేసేందుకు శ్రమించారు.

Updated Date - Nov 24 , 2026 | 01:02 AM