పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:37 PM
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు.
సిరిసిల్ల అర్బన్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలో బుధవారం 2కే రన్ చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో 2కే రన్‌ను ఎస్పీ మహేష్ బీ గితే ప్రారంభించి వారితో కలిసి బతుకమ్మ ఘాట్ వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రక్షణ కోసం విధు లు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగా లను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు. అమరవీరుల ఆశయ సాధన కోసం సమాజంలోని ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా మెలగాలని సూచిం చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముఖ్య ఉద్ధేశం అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు పోలీసులు ఎదుర్కొనే సవాళ్లపై అవగాహన కల్పించడమేనన్నారు. ప్రజలు పోలీసుల కు సహకరిస్తూ చట్టాలను గౌరవించాలని సమాజంలో శాంతి భధ్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు భాధ్యతను నిర్వర్తించాలని కోరారు. డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సీఐలు శ్రీని వాస్, నాగేశ్వర్‌రావు, వెంకటేష్, ఆర్‌ఐ మధుకర్, ఎస్‌ఐలు పాల్గొన్నారు.