Share News

పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:23 AM

శాంతిభద్రత ల పరిరక్షణకు విధి నిర్వహణలో పోలీసు అమరవీరు ల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ మహే ష్‌ బీ గితే అన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

చందుర్తి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రత ల పరిరక్షణకు విధి నిర్వహణలో పోలీసు అమరవీరు ల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఎస్పీ మహే ష్‌ బీ గితే అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందు ర్తి మండలం లింగంపేట గ్రామశివారులోని పోలీస్‌ అమరవీరుల స్తూపం వద్ద సంస్మరణ దినం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్‌ అధికారులతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సాయుధ పోలీసులు శోక్‌ శ్రస్త్‌ నిర్వహించి, మరణిం చిన పోలీసు అమరవీరులకు అధికారులు, సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వర కు దేశంలో విధి నిర్వహణలో మరణించిన 154మంది పోలీస్‌ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్ష ణకు సవాళ్లను ధీటుగా ఎదురించి, ప్రాణాలను సైతం త్యాగం చేసి, విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాణత్యాగాలు చేసిన పోలీస్‌ అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలి చిపోతారన్నారు. జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో 8మందికి పైగా పోలీసులు అసువులు బాసా రని, వారి త్యాగఫలం వల్లే గతంకంటే ప్రస్తుత పరి స్థితి మెరుగ్గా ఉందన్నారు. పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంద న్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, విధి నిర్వహణలో భాగంగా ఎన్నో జఠిలమైన సవాళ్లు ఎదురవుతున్నా అమరవీ రులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ చర్య ల్లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముం దుకు సాగుతున్నామన్నారు. దేశ సరిహద్దుల్లోని ఆక్సా య్‌చిన్‌ ప్రాంతంలో పహారా కాస్తున్న సీఆర్పిఎఫ్‌ పోలీసులను 1959లో చైనా దేశానికి చెందిన సైనికులు హతమార్చారని, అప్పటి నుంచి వారి త్యాగాలను స్మరి స్తూ అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబాల సభ్యులతో మాట్లా డి వారి పరిస్థితులు, సమస్యలను ఎస్పీ ఆరా తీశారు. వారు విన్నవించిన సమస్యలను సాధ్యమైనంత తొంద రగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. పోలీస్‌ అమ రవీరులను స్మరిస్తూ శాఖ ఆధ్వర్యంలో ఆక్టోబరు 21 నుంచి 31 వరకు రక్తదాన శిబిరాలు, సైకిల్‌ ర్యాలీ, క్యాండిల్‌ ర్యాలీ, రన్‌, ఓపెన్‌హౌస్‌, వ్యాసరచన పోటీ లు, ఫోటో, వీడియో పోటీలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ అమరవీరుల కుటుంబ సభ్యులు, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, సీఐలు రవిందర్‌, శ్రీనివాస్‌, వీరప్రసాద్‌, ఎస్‌ఐ రమేష్‌, మోతిరామ్‌, ప్రశాంత్‌రెడ్డి, ఆశోక్‌, ఆర్‌ ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్‌ బెటాలియన్‌లో..

సిరిసిల్ల రూరల్‌ : ప్రజల కోసం ప్రాణాలను అర్పిం చిన పోలీసుల త్యాగాలు మరువలేనివని 17వ పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ పీజేపీసీ ఛటర్జీ అన్నారు. సిరిసిల్ల అర్బన్‌ పరిధిలోని సర్ధాపూర్‌ 17వ పోలీస్‌ బెటాలియన్‌లో బుధవారం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్‌ అమరవీ రుల స్తూపం వద్ద పోలీస్‌ అధికారులు, సిబ్బందితో కలిసి కమాండెంట్‌ పీజేపీసీ ఛటర్జీ పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ 1959 సంవత్సరంలో భారత్‌-చైనా సరిహద్దులో విధి నిర్వహణలో అమరులైన భారత పోలీసులను స్మరించుకుంటూ దానికి గుర్తుగా ప్రతిసంవత్సరం అక్టో బరు 21న పోలీస్‌ అమరవీరుల దినోత్సవం నిర్వహిం చుకుంటుమని తెలిపారు. అమరులైన పోలీసుల సేవ లను కొనియాడారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సమాజంలో శాంతిభద్ర తలను కాపాడుతూ అవసరమైతే ప్రాణత్యాగం చేయ డానికి కూడా పోలీసులు వెనుకడారని అన్నారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌లు ఎంఐ సురేష్‌, రాందాస్‌, రాజు, సంజీవరెడ్డి, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ ఐలు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 12:23 AM