Share News

పారిశుధ్యంపై పాలకవర్గం దృష్టి సారించాలి

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:49 AM

జగిత్యాల పట్టణ పారిశుధ్యం, పచ్చదనం, టౌన్‌ప్లానింగ్‌తో పాటు పట్టణంలోని ప్రధాన సమస్యలపై నూతన పాలకవర్గం దృష్టి సారించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజ య్‌కుమార్‌ అన్నారు.

పారిశుధ్యంపై పాలకవర్గం దృష్టి సారించాలి
బాధ్యతలు స్వీకరిస్తున్న జగిత్యాల చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి

ఫ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): జగిత్యాల పట్టణ పారిశుధ్యం, పచ్చదనం, టౌన్‌ప్లానింగ్‌తో పాటు పట్టణంలోని ప్రధాన సమస్యలపై నూతన పాలకవర్గం దృష్టి సారించాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజ య్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల ము న్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా నూతనంగా ఎన్నికైన సమిండ్ల వాణి శ్రీనివాస్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ జీనత్‌ పర్విన్‌ మునిరొద్దిన్‌లు మున్సిపల్‌ కార్యా లయంలో గురువారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డా. సంజయ్‌ కుమార్‌ చైర్‌ పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ నూతన పాలకవర్గం త్వరితగతిన జనరల్‌ బాడీ సమా వేశం ఏర్పాటు చేసుకొని ప్రధాన సమస్యలు, బడ్జెట్‌ కేటాయింపులపై చర్చించాలని అన్నా రు. వార్డులో సమస్య పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకో వాలని అన్నారు. జగిత్యాల పట్టణాభివృద్ధికి తన వంతు సహ కారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాణి

జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తామని నూతనంగా ఎన్నికై బాధ్యత లు స్వీకరించిన మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సమిం డ్ల వాణి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సహాకారంతో పట్టణం లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్డ అభివృద్ధి, వీది దీపాల ఏర్పాటు, పౌర సేవల ప్రత్యేక దృష్టి సారిస్తాన న్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా పారదర్శక పరి పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు చైర్‌పర్సన్‌, కౌన్సిల్‌స భ్యులు పట్ట ణంలోని పాతబస్డాండ్‌ చౌరస్తాలో ఉన్న మాజీ ప్రధాని ఇందిర గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మున్సిపల్‌ కార్యాల యానికి చేరుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్‌పర్సన్‌ సమీండ్ల వాణి శ్రీని వాస్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ జీనత్‌ పర్విన్‌ ముని రోద్దిన్‌, కౌన్సిల్‌ సభ్యులు పట్టణంలోని ఫూలే దంపతుల విగ్రహాలకు పూల మాలాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, మాజీ మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ గిరి నాగభూష ణం, సీనియర్‌ నాయకులు గట్టు సతీష్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 12:49 AM